వైసీపీని డిఫెన్స్ లో ప‌డేసిన రాధా.. ఆ నిర్ణ‌యం స‌రైందేనా..?

ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో వంగ‌వీటి రాధా విష‌యం ఎంత హాట్ టాపిక్ గా ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.ఆయ‌న మీద హ‌త్యకు కుట్ర జ‌రుగుతోందని ఆయ‌న చేసిన ఆరోప‌ణ‌లు ఇప్పుడు సంచ‌ల‌నం రేపుతున్నాయి.

 Radha Who Defeated Ycp In Defense   Did That Decision Go Down ..?, Vangaveeti Ra-TeluguStop.com

కొంద‌రు రెక్కీ చేస్తున్నార‌ని ఆయ‌న మీడియా ముందు చెప్ప‌డంతో ఆ పని ఎవ‌రు చేస్తార‌నే టాపిక్ ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల‌ను కుదిపేస్తోంది.కాగా ఈ విష‌యం మీద అటు వైసీపీ, ఇటు టీడీపీలో కూడా పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగుతోంది.

కాగా ఈ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలోనే రాధా త‌నకు గ‌న్ మెన్లు వ‌ద్ద‌ని చెప్పారు.

అదేంటి ఓ వైపు హ‌త్య‌కు కుట్ర జ‌రుగుతోంద‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్న త‌రుణంలో గ‌న్ మెన్ల‌ను ఎందుకు వ‌ద్దంటున్నార‌నే సందేహం తెర మీద‌కు వ‌చ్చింది.

ఇక రాధా మీద ఉన్న స్నేహం కార‌ణంగా మంత్రి కొడాలి నాని ఈ విష‌యాన్ని సీఎం జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్ల‌గా.రాధాకు 2 ప్లస్ 2 గన్ మెన్లను కేటాయించార‌ని నాని వెల్ల‌డించారు.

రాధాకు అన్ని విధాలుగా సెక్యూరిటీ క‌ల్పిస్తామ‌ని చెప్పారు కొడాలి నాని.అంతే కాదు ఎవ‌రు రెక్కీ చేశారో కూడా క‌నిపెట్టాలంటూ డీజీపీని సీఎం ఆదేశించార‌ని చెప్పుకొచ్చారు.

కాగా ఆ గ‌న్ మెన్ల‌ను ఇప్పుడు రాధా వ‌ద్ద‌న్నారంట‌.

Telugu Ap Potics, Chandra Babu, Kodali Nani, Tdp Paerty, Ys Jagan-Telugu Politic

ఈ విష‌యాన్ని రాధానే స్వ‌యంగా వివ‌రించారు.త‌న‌కు ఎలాంటి సెక్యూరిటీ అవ‌స‌రం లేదంటూ వివ‌రించారు.త‌న‌కు జ‌నబ‌లం ఉంద‌ని, త‌న‌ను ఎవ‌రూ ఏం చేయ‌లేర‌ని చెప్పుకొచ్చారు.

దీంతో ఆయ‌న నిర్ణ‌యం రాజకీయంగా వైసీపీని డిఫెన్స్ లో పడేసింది.తాము రాధాను కాపాడుతున్నామ‌నే భావ‌న క‌ల్పించాల‌ని వైసీపీ చూస్తే.

చివ‌రకు ఆయ‌న నిర్ణ‌యం వైసీపీనే ఇబ్బందుల్లో ప‌డేసింది.ఇలాంటి స‌మ‌యంలో రాధాకు ఏదైనా చిన్న ప్ర‌మాదం జ‌రిగినా అది ప్ర‌భుత్వం మీద ఎఫెక్ట్ చూపుతుంది.

మ‌రి రాబోయే కాలంలో ఏం జ‌రుగుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube