శంకర్ పై మండి పడుతున్న తమిళ్ డబ్బింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు...  

Radha Ravi Reacts About Bharateeyudu 2 Movie Shooting Accident - Telugu Bharateeyudu 2 Movie Incident, Kajal, Kamal Hassan, Kolywood, Radha Ravi, Radha Ravi Tamil Dubbing Association President, Rakul Preet News, Shankar

తాజాగా ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్నటువంటి భారతీయుడు 2 చిత్ర షూటింగ్ సమయంలో క్రేన్ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.అంతేగాక ఈ ప్రమాదంలో ఈ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు మరియు అక్కడే ఉన్నటువంటి ఓ లైట్ మెన్ తీవ్ర  గాయలయ్యి అక్కడికక్కడే మృతి చెందారు.

Radha Ravi Reacts About Bharateeyudu 2 Movie Shooting Accident

అలాగే ఈ ప్రమాదంలో దాదాపుగా పది మందికి పైగా గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అయితే ఈ విషయంపై తాజాగా తమిళ డబ్బింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు రాధా రవి స్పందించారు.

ఇందులో భాగంగా ఈ ప్రమాదంపై దర్శకుడు శంకర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.హాలీవుడ్ రేంజ్ లో సినిమాలు తీయడం కాదని, ఆ సినిమాకి కష్టపడి పనిచేసేటువంటి వారి రక్షణకై కూడా చర్యలు తీసుకోవాలని అన్నారు.

అంతేగాక ఆయనకు సినిమాపై ఉన్నంత శ్రద్ద తన సినిమాకి పని చేసినటువంటి వ్యక్తుల రక్షణపై ఉండదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

అయితే ఇప్పటికే భారతీయుడు 2 చిత్రం సమయంలో జరిగినటువంటి ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకి ఆర్థిక సహాయ నిమిత్తం ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నటువంటి కమలహాసన్ కోటి రూపాయలు ప్రకటించారు.అంతేగాక పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందించి తగిన ఆర్థిక సహాయం చేయాలని కోరారు.అయితే ప్రస్తుతం ఈ ప్రమాదం గురించే కోలీవుడ్ సినీ ఇండస్ట్రీ  పలు రకాలుగా మాట్లాడుకుంటుంది.

అంతేగాక ఈ ప్రమాదానికి దర్శకుడు శంకర్ ని మొత్తం బాధ్యుడిని చేస్తూ రూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

తాజా వార్తలు

Radha Ravi Reacts About Bharateeyudu 2 Movie Shooting Accident-kajal,kamal Hassan,kolywood,radha Ravi,radha Ravi Tamil Dubbing Association President,rakul Preet News,shankar Related Telugu News,Photos/Pics,Images..