కరోనా వైరల్‌ వీడియో : ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద మన పోలీసులు ఏం చేస్తున్నారో చూడండి

కరోనా వైరస్‌పై ఇండియా పెద్ద యుద్దమే చేస్తోంది.ప్రధాని ఇప్పటికే కరోనా వైరస్‌ను స్వీయ నియంత్రణ ఇంకా స్వీయ శుభ్రతతో మాత్రమే రాకుండా చేసుకోవచ్చు అంటూ పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హై ఎలర్ట్‌ కనిపిస్తోంది.

 Rachakonda Traffic Police Sensitising Commuters On The Precautions To Be Taken-TeluguStop.com

ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా అవగాహణ చర్యలు తీసుకుంటున్నారు.కరోనా నేపథ్యంలో ప్రతి చోట కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లోని పలు ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద కరోనా అవగాహణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

రాచకొండ పోలీసు కమీషనర్‌ ఆదేశాల మేరకు ప్రతి ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద కూడా కరోనా వైరస్‌ నుండి దూరంగా ఎలా ఉండాలనే విషయమై అవగాహణ కల్పిస్తూ వాహణదారులను హెచ్చరిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద పోలీసులు కరోనా అవగాహణకు సంబంధించిన విషయాలు చెబుతున్న వీడియో వైరల్‌ అవుతుంది.ఆ వీడియో వాట్సప్‌, హలో, ఫేస్‌ బుక్‌ ఇలా అన్ని సోషల్‌ మీడియా వేదికలపై వైరల్‌ అవుతోంది.

ఆ వీడియోలో ట్రాఫిక్‌ ఎస్సై మాట్లాడుతూ అన్నం తినడానికి ముందు తప్పనిసరిగా చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలని సూచించారు.ప్రతి గంట లేదా రెండు గంటలకు ఒకసారి ఖచ్చితంగా చేతులను కడుక్కోవడంతో పాటు తప్పనిసరిగా మంచి నీటిని తాగుతూ ఉండాలి.గొంతు తడి ఆరిపోకుండా ఉండేలా చూసుకోవాలంటూ ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద వాహనదారులకు సలహాలు ఇస్తూ ఉన్నారు.ఈ కార్యక్రమం నిజంగా చాలా అభినందనీయం అంటూ సోషల్‌ మీడియా జనాలు అభినందిస్తూ ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube