ఎల్బీనగర్: రాచకొండ సీపీ మహేష్ మురళీధర్ భగవత్ మాట్లాడుతూ.ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేస్తున్న ముఠా.
హయత్ నగర్, వనస్థలిపురం, అమీర్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధిలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసాలకు పాల్పడుతున్న ముఠా.ఫేక్ జాబ్ చీటింగ్ రాకెట్ ముఠా 4 సభ్యులను అరెస్ట్ చేసిన రాచకొండ SOT పోలీసులు.
వీరి వద్ద నుండి 5 లక్షల 70 వేల నగదును, నకిలీ ఉద్యోగ నియామక ఉత్తర్వు పత్రాలను, 53 నకిలీ రబ్బరు స్టాంపులు, ల్యాప్టాప్ లను, ప్రింటర్ లు , 4 మొబైల్ ల ను స్వాధీనం చేసుకున్న SOT పోలీసులు.
గవర్నమెంట్ లలో ఉద్యోగాలు లేవు, ఔట్ ఒర్సింగ్ల లో ఉద్యోగా లు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ముఠా.మద్దెలమడుగు వర కుమార్ (36), యతకుల ప్రమోద్ కుమార్(32), వెన్ను దినకర్ రెడ్డి(44), విప్పర్తి ప్రకాష్(50) నిందితుల ను అరెస్ట్ చేసిన పోలీసులు.
19 పంచాయితీ డిపార్ట్మెంట్ మరియు 5 జ్యూడిషియల్ ఉద్యోగాలు నకిలీ ఉద్యోగ నియామక పత్రాలు, 24 మంది భాదితులు ఉన్నారని తెలిపిన సిపి.కాంట్రాక్ట్ మరియు ఔట్ ఒర్సింగ్ ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగులను టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠా అని తెలిపిన రాచకొండ సిపి.