ఘట్‌కేసర్ రేప్ కేస్ లో ట్విస్ట్.. తూచ్ అదంతా అబద్దం అంటున్న యువతి..

తూచ్ అదంతా అబద్దం అసలు అత్యాచారమే జరుగలేదు.మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లో బి ఫార్మసీ విద్యార్థిపై జరిగిన అత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.

 Rachakonda Cp Gives Clarity On Ghatkesar Rape Case, Rachakonda, Crime News, Tela-TeluguStop.com

కాలేజ్ నుండి ఇంటికి వెళ్తున్న విద్యార్థిపై ఆటో డ్రైవర్లు అత్యాచారానికి పాల్పడినట్లు భాదిత యువతీ తెలిపింది.ఈ కేసుపై పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు బయటపడ్డాయి.

రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఈ కేసు గురించిన వివరాలను మీడియాకు వివరించారు.

ఆయన మాట్లాడుతూ ఆ యువతీ కావాలనే అబద్దం చెప్పింది ఇది తప్పుడు కేసని ఆ యువతి తల్లికి భయపడి అబద్దం చెప్పినట్లు పోలీసులు క్లారిటీ ఇచ్చారు.

విచారణలో ఆ యువతి సంభందం లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చి కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు నిజాలు బయటకు వచ్చాయి.ఆ యువతి కావాలని తన బట్టలు తానే చింపుకొని అత్యాచారం జరిగినట్లు డ్రామా ఆడిందని మహేష్ భగవత్ తెలిపారు.

రాంపల్లిలోని ఆర్ఎల్ నగర్‌కు చెందిన ఒక యువతీ బి ఫార్మసీ చదువుతుంది.బుధవారం రోజు చీకటి పడ్డా ఇంకా ఇంటికి రాలేదని తల్లిదండ్రులు ఆందోళనతో ఉన్నారు.

కాసేపటి ఆ యువతి ఫోన్ చేసి తనను ఆటో డ్రైవర్ కిడ్నప్ చేసాడని చెప్పింది.ఆమె తల్లిదండ్రులు వెంటనే 100కి కాల్ చేసారు.

ఆ యువతి ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆమెను గాలించారు.అన్నోజిగూడ ఓఆర్ఆర్ సమీపంలో రోజ్జు పక్కన ఆ యువతీ కనిపించడంతో వెంటనే ఆమెను హాస్పిటల్ కు తరలించారు.

ఆ యువతి స్పృహ లోకి వచ్చిన తర్వాత తనను ఆటో డ్రైవర్స్ గ్యాంగ్ రేప్ చేసారని పోలీసులకు చెప్పింది.దీంతో పోలీసులు నిర్భయ కేసు నమోదు చేసుకున్నారు.

తర్వాత రోజు నలుగురు ఆటో డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.తర్వాత సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసే సమయంలో ఆ యువతి చెప్పే సమాధానాలు పొంతనలేక పోవడంతో చుట్టూ ప్రక్క ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను మరోసారి పరిశీలించారు.

ఆ రోజు ఆ ప్రాంతంలో యువతి ఒంటరిగానే సంచరించినట్లు గుర్తించారు.అంతేకాదు ఆ సమయంలో ఆ ఆటో డ్రైవర్స్ ఫోన్ సిగ్నల్స్ కూడా అక్కడ చూపించలేదు.

దీంతో పోలీసులకు అనుమానం వచ్చి ఆమెను గట్టిగ నిలదీయడంతో అసలు నిజం ఒప్పుకుంది.తన తల్లి చీకటి పడిన ఇంటికి వెళ్లకపోవడంతో పదే పదే ఫోన్ చేస్తుందని తనను ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేసాడని చెప్పింది.

ఆమెను ఎవరు కిడ్నాప్ గాని, రేప్ గానీ చేయలేదని అయన చెప్పారు.ఈ కేసు విచారణలో ఆటో యూనియన్లు తమకు బాగా సహకరించారని సీపీ మహేష్ తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube