తల్లి ప్రేమకు( Mothers Love ) అవధులు ఉండవు.ఇది మనుషులలో అయినా, జంతువులలో అయినా ఒకేలా ఉంటుంది.
తమ పిల్లల కోసం అవసరం అయితే తల్లి తన ప్రాణాన్ని ధార బోస్తుంది.చివరికి కోడి కూడా తన పిల్లల జోలికి వస్తే వారిపై ఎగిరెగిరి దాడి చేస్తుంది.
తన పిల్లలకు ఏ ఆపద రాకుండా రెక్కల చాటున కప్పుతుంది.ఇదే కోవలో ఓ కుందేలు ప్రాణాలకు తెగించి పాముతో పోరాడింది.
ఓ భారీ పాము తన పిల్లలు ఉన్న గూడు వైపు వెళ్లడం ఆ కుందేలు చూసింది.వెంటనే వెళ్లి ఆ పాముతో తలపడింది.
ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా పాముతో ఫైట్ చేసింది.ఆ పాము తన పడగ విప్పి కాటు వేయడానికి చాలా సార్లు ప్రయత్నించింది.
అయినా కుందేలు( Rabbit ) ఏ మాత్రం భయపడలేదు.తన పిల్లలను దాని బారి నుంచి కాపాడాలని విశ్వప్రయత్నం చేసింది.చివరికి సక్సెస్ అయింది.పాము మరియు కుందేలు ఒకరితో ఒకరు భీకర యుద్ధానికి సిద్ధమైనట్లుగా ఒకదానితో ఒకటి ముఖాముఖిగా ఉండటంతో వీడియో ప్రారంభమవుతుంది.పాము( Snake ) మెరుపు వేగంతో కాటు వేయడానికి చూస్తుంది.కుందేలు లొంగిపోవడానికి నిరాకరించి, ఎదురుదాడి కొనసాగిస్తుంది.
ఆ పాము తనతో పోరాడుతున్న కుందేలును కాటు వేసి చంపాలని ప్రయత్నించింది.
అయితే కుందేలు దానికి దొరకలేదు.కాటు వేయడానికి ప్రయత్నించగానే పాము నుంచి తప్పించుకునేందుకు గాలిలోకి ఎగిరింది.ఇలా పలుమార్లు దానికి దొరక్కుండా తప్పించుకుంది.చివరికి అలసిపోయిన పాము అక్కడి నుంచి వెళ్లిపోయింది.ఇలా తన పిల్లలను పాము బారి నుంచి ఆ కుందేలు కాపాడుకుంది.దీనిని గిసెల్లే కూ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.ఈ వీడియోకు నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన వస్తోంది.
తల్లి ప్రేమ అంటే ఇదేనని, పాముకు కుందేలు చుక్కలు చూపించిందని కామెంట్లు చేస్తున్నారు.