ఆ దర్శకుడు ఆ విషయంలో నన్ను మోసం చేశాడంటున్న రాశి…  

Raasi, Telugu veteran actress, Nijam movie director, Telugu movie news, Actress Raasi about Nijam Movie role - Telugu Nijam Movie Director, Raasi, Telugu Movie News, Telugu Veteran Actress

తెలుగులో ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన “గోకులంలో సీత” అనే చిత్రంలో టాలీవుడ్ పవర్ స్టార్ మరియు జనసేన పార్టీ అధినేత “పవన్ కళ్యాణ్”కి జోడిగా నటించిన తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండి ఫ్యామిలీ ఓరియెంటెడ్ మరియు ఎమోషనల్ పాత్రలలో ప్రేక్షకులను రాశి బాగానే అలరించింది.

 Raasi Sensational Comments Nijam Movie Director

అయితే ఇటీవలే ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో నటి రాశి పాల్గొంది.

ఇందులో భాగంగా తన సినీ జీవితం గురించి పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకుంది.

ఆ దర్శకుడు ఆ విషయంలో నన్ను మోసం చేశాడంటున్న రాశి…-Latest News-Telugu Tollywood Photo Image

అయితే నెగిటివ్ షేడ్స్ మరియు బోర్డ్ తరహా ఉన్నటువంటి పాత్రలో నిజం అనే సినిమాలో నటించానని తెలిపింది.అయితే ఆ చిత్ర దర్శకుడు తనకు ముందుగా తనని నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలో నటింప చేస్తున్నట్లు చెప్పలేదని కానీ సినిమా ఒప్పుకున్న తర్వాత తనకి మాత్రం చేయక తప్పలేదని చెప్పుకొచ్చింది.

ఒకవేళ తాను అలాంటి పాత్రలో నటిస్తున్నట్లు తనకు ముందే తెలిసి ఉంటే కచ్చితంగా నిర్మొహమాటంగా నో చెప్పేదాని తెలిపింది.

అయితే పెళ్లి తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పి కొంతకాలం పాటు తన ఫ్యామిలీ బాధ్యతలతో బిజీబిజీగా గడిపింది.

ఆ తర్వాత దాదాపుగా 12 సంవత్సరాల తర్వాత టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య హీరోగా నటించిన “కళ్యాణ వైభోగమే” అనే చిత్రంలో హీరోయిన్ తల్లి పాత్రలో నటించింది.ఆ తర్వాత “లంక” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించినప్పటికీ ఆ చిత్రం పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

#Raasi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Raasi Sensational Comments Nijam Movie Director Related Telugu News,Photos/Pics,Images..