ఆర్ధిక ఇబ్బందుల కారణంగానే అలాంటి పనులు చేస్తోన్న ఒకప్పటి బ్యూటీ  

Raasi Actress Raasi Tollywood News - Telugu Actress Raasi, Financial Problems, Raasi, Tollywood News

ఒకప్పటి స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న అందాల భామ రాశి, అప్పట్లో వరుసబెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది.ఆమె నటించిన సినిమాలు అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచాయి.

 Raasi Actress Raasi Tollywood News

ఆమె నటనకు అభిమానులు నీరాజనాలు పట్టారో లేదో తెలియదు కానీ అందానికి మాత్రం కుర్రకారు బ్రహ్మరథం పట్టేవారు.అందుకే రాశి అంటే అప్పట్లో యూత్‌కు పిచ్చ క్రేజ్ ఉండేది.

ఇక కాలక్రమంలో రాశి హీరోయిన్‌గా అవకాశాలు తగ్గడంతో సెకండ్ హీరోయిన్ పాత్రలు, ప్రాధాన్యత లేని పాత్రల్లో నటించేందుకు కూడా ఓకే అంది.చివరకు వాంప్ పాత్రలకు కూడా ఆమె ఓకే అన్నదంటే అందులో ఏదో బలమైనా కారణం ఉండే ఉంటుంది అని అందరూ అనుకున్నారు.

ఆర్ధిక ఇబ్బందుల కారణంగానే అలాంటి పనులు చేస్తోన్న ఒకప్పటి బ్యూటీ-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

నిజానికి రాశి ఆర్ధికంగా తీవ్ర కష్టాల్లో ఉన్నందుకే ఇండస్ట్రీలో వాంప్ పాత్రలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే టాక్ ఉంది.అయితే ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో ఎవ్వరికీ తెలియదు.

కాగా వివాహం అయిన తరువాత రాశి గురించి పెద్దగా పట్టించుకున్న వారు లేరు.దీంతో ఆమె ఇప్పుడు మళ్లీ యూట్యూబ్‌లో వంటలు చేస్తూ వీడియోలు తీస్తూ కనిపిస్తుంది.

అదేంటి.మళ్లీ రాశికి ఆర్ధిక ఇబ్బందులు ఎదురయ్యాయా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు.

కానీ సినీ వర్గాల్లో ఉన్న సమాచారం ఏమిటంటే, రాశి ఇంకా తన ఆర్ధిక సమస్యల నుండి బయటకు రాలేదని తెలుస్తోంది.అందుకే ఇలా యూట్యూబ్‌లో వంటలు చేస్తూ దర్శనమిచ్చిందనే టాక్ వినిపిస్తుంది.

మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఆమె స్పందించే వరకు ఆగాల్సిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Raasi Actress Raasi Tollywood News Related Telugu News,Photos/Pics,Images..

footer-test