ఈ ముద్దుగుమ్మకి పెద్ద దర్శకులు కావాలంట

ఊహలు గుసగుసలాడే తో తెలుగు సినిమాకు పరిచయమై .కుర్రకారు ఊహల్లో విహరిస్తున్న సుందరి రాశి ఖన్నా .

 Raashi Khanna Wants To Work With Big Directors-TeluguStop.com

చూడగానే ఆకట్టుకునే ఈ అందం ప్రస్తుతం చేతిలో మంచి చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతోంది .అయితే రాశి ఇప్పటివరకు పని చేసిన దర్శకులంతా దాదాపు కొత్తవారే .మరి మన రాశికేమో పెద్ద దర్శకులతో పని చేయాలని ఉందట .ఇదే విషయాన్ని ఇలా పంచుకుంది .

” నేను దాదాపు కొత్త దర్శకులతోనే సినిమాలు చేస్తున్నాను.శివమ్ దర్శకుడికి ఇది మొదటి సినిమానే.

చాలా క్లారిటీగా, కంఫర్ట్‌గా తీశారాయన.నాకు పెద్ద దర్శకులతో సినిమాలు చేయాలని ఉంది.

ఎవరు అవకాశం ఇచ్చినా కాదనను.తెలుగు పరిశ్రమలో నా స్థానం ఏంటి? అనే విషయం గురించి పెద్దగా ఆలోచించడంలేదు.మంచి అవకాశాలు వస్తున్నాయి.అన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను.పోటీ గురించి కూడా పట్టించుకోవడంలేదు.ప్రతిభతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలంటారు.

ఆ విషయాన్ని నేను నమ్ముతాను.నేను యాక్ట్ చేస్తున్న సినిమాలు సక్సెస్ అవ్వడంతో పాటు నాక్కూడా మంచి పేరొస్తోంది.

సో.నా హార్డ్ వర్క్‌కి లక్ తోడైందని నమ్ముతున్నాను.”

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube