భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరు ఊహించలేము... నటి రాశి ఖన్నా కామెంట్స్ వైరల్!

ఊహలు గుసగుసలాడే సినిమా( Oohalu Gusagusalade ) ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమయ్యారు నటి రాశి ఖన్నా( Rashi Khanna ).ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె అనంతరం తెలుగులో పలు సినిమాలలో నటించి నటిగా మంచి పేరు పెట్టారు కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ప్రస్తుతం తెలుగు తమిళ సినిమాలకు కాస్త దూరమైనప్పటికీ బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం వరుస అవకాశాలను అందుకుంటూ బిజీగా ఉన్నారు.

 Heroine Raashi Khanna Sensational Comments About Future,raashi Khanna,cine Caree-TeluguStop.com

ఇలా ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సిరీస్ లలో కూడా నటిస్తున్నారు.

Telugu Bollywood, Cine Career, Offers, Raashi Khanna, Raashikhanna, Tollywood-Mo

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ( Bollywood Industry )లో పలు సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి రాశిఖన్నా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ ఫోటోషూట్లు చేయించుకోవడమే కాకుండా ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.ఇలా సోషల్ మీడియాలో అమ్మడి అందాల ఆరబోత కాస్త ఎక్కువైందని చెప్పాలి.

ఇకపోతే తాతగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రాశి ఖన్నా తన సినీ కెరియర్ ( Cine Career ) గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

Telugu Bollywood, Cine Career, Offers, Raashi Khanna, Raashikhanna, Tollywood-Mo

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తాను ఎవరి అండ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని తెలిపారు.అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన తాను ఎంతో మంచిగా పేరు ప్రఖ్యాతలను అభిమానులను కూడా సొంతం చేసుకున్నానని తెలియజేశారు.ఇక తాను నటించిన సినిమాలు మంచి సక్సెస్ కావడంతో కొన్నిసార్లు తాను కూడా ఈ విజయాన్ని నమ్మలేకపోయానని ఈమె తెలిపారు.

నటిగా తాను ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నానని తెలియజేశారు.ఇక సినిమా ఇండస్ట్రీ అన్నది ప్రతి ఒక్కరికి శాశ్వతం కాదని తెలిపారు.ఒక నటిగా తన జీవితం, తన భవిష్యత్తు( Future ) ఏంటి అనేది ఎవరు ఊహించలేరని ఈమె తెలియజేశారు.ఈరోజు అవకాశాలు వచ్చిన రేపు మన దారి ఎటు అన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తుతూనే ఉంటుందని ఈ సందర్భంగా రాశిఖన్నా చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube