చీరకట్టులో మైమరిపిస్తున్న రాశి ఖన్నా!

ఊహ‌లు గుసగుస‌లాడే నా హృద‌యం ఊగిస‌లాడే అంటూ కుర్రకారు మ‌నుస్సు దోచినా, బెంగాల్ టైగ‌ర్ లో బికిని వేసి సెగ‌లు పుట్టించినా.రౌడీ తో రొమాన్స్ చేసినా అభిమానులు మాత్రం ఆమెను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు.2013లో తెర‌కెక్కిన మద్రాస్ కెఫె లో ఇండియ‌న్ ఇంటెలిజెన్స్ అధికారి విక్రం సింగ్ భార్య రూబి సింగ్ పాత్ర ద్వారా హిందీలో ఎంట్రీ ఇచ్చింది.ఆ సినిమా త‌రువాత న‌టుడు, డైర‌క్ట‌ర్ గా అవ‌స‌రాల శ్రీనివాస్ తెర‌కెక్కించిన చిత్రం ఊహ‌లు గుస‌గులాడే.

 Raashi Khanna, Sarie Photos, Viral In Internet, Tollywood Heroine, Venky Mama, P-TeluguStop.com

ఈ సినిమాతో బ‌బ్లీ గర్ల్ రాశిఖ‌న్నా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.

ఆ త‌రువాత జోరు, జిల్, బెంగాల్ టైగ‌ర్, సుప్రీం, జై ల‌వ కుశ‌, ట‌చ్ చేసి చూడు, తొలిప్రేమ రీసెంట్ గా వ‌చ్చిన ప్రతీ రోజు పండగే, వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్, వెంకిమామ వంటి హిట్ చిత్రాల్లో న‌టించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.

అయినా అమ్మడు అదృష్టం తెలుగులో అట్ట‌ర్ ప్లాప్ అయ్యింది.దీంతో తెలుగులో ఆఫ‌ర్ల కోసం చ‌బ్బీ చీక్స్ బేబి అప్పుడప్పుడు పాటలు పాడుతూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంటుంది.

తొలి సినిమా ఊహ‌లు గుస‌గుస‌లాడే చిత్రంలో ఏం సందేహం లేదంటూ పాడి త‌న టాలెంట్ ను బ‌య‌ట‌పెట్టింది.జోరు, జవాన్ తో పాటు త‌మిళంలో విశాల్, మోహ‌న్ లాల్ సినిమాల్లో పాడి అంద‌ర్ని మెప్పించింది.

త‌మిళంలో హీరోయిన్ గా వ‌రుస ప్రాజెక్ట్ లున్నా. తెలుగులో అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో సోష‌ల్ మీడియాలో చబ్బీ చబ్బీ అందంతో హాట్‌ హాట్‌ ఫొటోలతో కాక‌రేపుతుంది.

తాజాగా ప‌సుపు రంగు చీర‌లో వయ్యారాలు పోయింది.చీర‌క‌ట్టులో బాపు బొమ్మ‌లా త‌యారై కుర్ర‌కారు గుండెల్లో వ‌ల‌పు బాణాల్ని గుచ్చింది ముద్దుగుమ్మ రాశీ ఖన్నా.ఇక ఇప్పుడే కాదు గత పది రోజులుగా రాశి ఖన్నా వివిధ రకాల చీరకట్టులో ప్రత్యేక్షమై అందరిని షాక్ కి గురి చేస్తుంది.అదేంటి.

ఆఫర్లు రాకపోతే ఈ హీరోయిన్ అయినా వెస్ట్రన్ వేలో మితిమీరి అందాల ఆరబోత చేస్తారు మరి ఈమె ఏంటి ఇలా ఇండియన్ వేలో ట్రేడిషనల్ గా ఉంటూ చెలరేగిపోతుంది అని ఆశ్చర్యపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube