పాపం.. రవితేజ సినిమాలో రాశి మెరుపుతీగా..?

మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ క్రాక్ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది.ఈ సినిమాలో రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా, ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.

 Raashi Khanna Item Song In Raviteja Movie, Raviteja, Krack, Raashi Khanna, World-TeluguStop.com

ఇక ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే సక్సె్స్‌ను తన ఖాతాలో వేసుకునేందుకు రవితేజ రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా తరువాత దర్శకుడు రమేష్ వర్మ డైరెక్షన్‌లో తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రవితేజ రెడీ అవుతున్నాడు.ఇప్పటికే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రవితేజ, ఇందులో హీరోయిన్ రాశి ఖన్నాను తీసుకుంటున్నాడంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

దీంతో రాశికి మరోసారి హీరోయిన్‌గా నిలదొక్కుకునే అవకాశం వచ్చిందని అందరూ అనుకున్నారు.కానీ ఈ సినిమాలో రాశి ఖన్నా ఓ మెరుపుతీగలా మనకు కనిపిస్తుందని తెలుస్తోంది.

ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్‌లో చిందులేసేందుకు రాశి ఖన్నాను చిత్ర యూనిట్ సంప్రదించిందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.రాశి ఖన్నా వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంతో తనకున్న క్రేజ్‌ను పూర్తిగా పోగొట్టుకుని ప్రస్తుతం సినిమలు లేకుండా ఉంది.

దీంతో ఇప్పుడు తనకు వచ్చిన ఈ స్పెషల్ సాంగ్ ఆఫర్‌ను ఆమె ఒప్పుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube