విజయ్‌ దేవరకొండకు హీరోయిన్‌ ముద్దు ముద్దు రిక్వెస్ట్‌, ఒప్పుకుంటాడా మరి?  

Raashi Khanna Cute Request To Vijay Devarakonda - Telugu Love Stories, Raashi Khanna, , Vijay Devarakonda, World Famous Lover

ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.ఈ వారంలోనే ఈ చిత్రం విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.

Raashi Khanna Cute Request To Vijay Devarakonda

భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ ప్రేమ కథల చిత్రాన్ని విజయ్‌ దేవరకొండ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేశాడట.ఇటీవల ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ తాను చేసిన చివరి ప్రేమ కథ చిత్రం ఇదే అని, మళ్లీ ప్రేమ కథలతో సినిమాలు చేయనంటూ సంచలన ప్రకటన చేశాడు.

విజయ్‌ దేవరకొండ లవ్‌ స్టోరీలకు గుడ్‌ బై చెప్పడంను చాలా మంది తప్పుబడుతున్నారు.ఈ వయసులో కాకుండా లవ్‌ స్టోరీలను ఇంకా ఏ వయసులో చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.

విజయ్‌ దేవరకొండ అభిమానులు కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నారు.అస్సలు ఇలాంటి నిర్ణయాన్ని విజయ్‌ దేవరకొండ నుండి ఊహించలేదు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదే సమయంలో హీరోయిన్‌ రాశి ఖన్నా కూడా విజయ్‌ దేవరకొండ నిర్ణయంపై స్పందించింది.

విజయ్‌ దేవరకొండ లవ్‌ స్టోరీలకు గుడ్‌ బై చెబుతున్నట్లుగా చేసిన ప్రకటన వెనక్కు తీసుకోవాలని రిక్వెస్ట్‌ చేసింది.ఖచ్చితంగా మళ్లీ మళ్లీ విజయ్‌ దేవరకొండ లవ్‌ స్టోరీ చిత్రాలను చేయాల్సిందే అంటూ ముద్దు ముద్దుగా విజయ్‌ దేవరకొండను రాశిఖన్నా రిక్వెస్ట్‌ చేసింది.మరి ఈ అమ్మడు ఇంత ముద్దుగా రిక్వెస్ట్‌ చేస్తే ఒప్పుకోకుండా ఉంటాడా చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Raashi Khanna Cute Request To Vijay Devarakonda Related Telugu News,Photos/Pics,Images..