రాశి ఆ హీరోతో ప్రేమలో పడలేదట

ఊహలు గుసగుసలాడే తో తెలుగు కుర్రాళ్ళ ఊహల్లో తిష్ఠ వేసిన అందం రాశీ ఖన్నా.తొలిచిత్రంలో హీరో నాగశౌర్యకి సరిజోడిగా కనిపించింది రాశి.

 I Am Not In Love – Raashi Khanna-TeluguStop.com

మరి ఎలా పుట్టాయో తెలియదు కాని, రాశికి నాగశౌర్యకి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని పుకార్లు తెగ చక్కర్లు కొడుతున్నాయి.

దీనిపై స్పందించిన రాశి ” అసలు ఈ రూమర్స్ ఎలా పుట్టిస్తారో అర్థం కాదు.

నాకు, నాగశౌర్యకి మధ్య ప్రేమేంటి! నాకు తను మంచి స్నేహితుడు.మేమిద్దరం చివరిసారి ఎప్పుడు కలిసామో కూడా సరిగా గుర్తు రావట్లేదు.

అలాంటిది మీడియావారు ఏకంగా ప్రేమకథలు రాసేస్తున్నారు.ప్రస్తుతానికి నేను సింగిల్ గా ఉన్నాను, అలాగే చాలా సంతోషంగా ఉన్నాను.

ఇప్పట్లో ప్రేమలో పడే ఆలోచనలు లేవు.నా దృష్టంతా కెరీర్ మీదే ఉంది” అంటూ చెప్పుకొచ్చింది రాశి.

రాశి ప్రస్తుతం సాయి ధరమ్ సరసన సుప్రీమ్ చిత్రీకరణలో బిజీగా ఉంది.రాశి నటించిన బెంగాల్ టైగర్ ఈ నెల 10వ తేదిన విడుదల కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube