2020 నా జీవితంలో ఓ చీకటి అధ్యాయం అంటున్న లక్ష్మి రాయ్...

2020… ఈ ఏడాది ప్రతి ఒక్కరి జీవితంలో విషాదాలని మిగిల్చింది.మానసికంగా, ఆర్ధికంగా ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా చాలా వేదనని మిగిల్చింది అని చెప్పాలి.

 Raai Laxmi Mourns Fathers Death With Emotional Note-TeluguStop.com

కొన్ని కోట్ల మంది ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు.లక్షలు జీతాలు సంపాదించిన వారి నుంచి సామాన్యుల వరకు అందరిది ఒకటే పరిస్థితి.

కొంత మంది జీవితాలలో అంతకు మించి కరోనా మరో రూపంలో విషాదం నింపింది.దిగ్గజ గాయకుడు ఎస్పీబాలసుబ్రహ్మణ్యం కరోనాతో మృతి చెందారు.

 Raai Laxmi Mourns Fathers Death With Emotional Note-2020 నా జీవితంలో ఓ చీకటి అధ్యాయం అంటున్న లక్ష్మి రాయ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే ఇప్పుడు టాలీవుడ్ అందాల భామ హీరోయిన్ లక్ష్మి రాయ్ కూడా తన జీవితంలో 2020 ఎంత విషాదాన్ని నింపింది అనే విషయాన్ని తాజాగా షేర్ చేసుకుంది.తాజాగా ఈమె చేసిన ఎమోషనల్ కామెంట్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

రాయ్ లక్ష్మీ మాట్లాడుతూ అందరి జీవితాల్లోనూ కష్టాలు వస్తాయి.కన్నీళ్లతో కుమిలిపోతున్న సందర్భాలు కూడా చాలా ఉంటాయి.అయితే 2020 సంవత్సరం మొత్తం నాకు చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది.ఏడాది నుండీ ఎన్నో కష్టాలు, నష్టాలను చవి చూసాను.

లాక్ డౌన్ టైములో నాలుగు గోడలకే పరిమితమవ్వడం ఒక కారణం అయితే, అదే టైములో నా తండ్రి అనారోగ్యం పాలవ్వడం, ఆయన గొంతు క్యాన్సర్ తో బాధపడుతూ మరణించడం నన్ను చాలా కృంగదీసింది.ఆ సమయంలో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను.

తన తండ్రి అనారోగ్యంతో ఉన్న సమయంలో సరైన ట్రీట్మెంట్ కూడా ఇప్పించలేకపోయా అని లక్ష్మీ రాయ్ తన ఆవేదనని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.రంగుల ప్రపంచంలో హీరోయిన్స్ గా వారి అందాలని చూసే నెటిజన్లకి అప్పుడప్పుడు ఇలా వారిలోని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా కొంత మంది భామలు పరిచయం చేస్తున్నారు.

లక్ష్మీరాయ్ సినిమా ప్రయాణం కూడా ఆరంభం నుంచి ఏమంత భాగోలేదు.సినిమాలు చేస్తున్న అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు.

ఆర్ధికంగాను, మానసికంగాను 2020 ఆమెకి ఒక పీడకలలా మారిందని ఆమె మాటల బట్టి అర్ధమవుతుంది.

#Depression #Social Media #Comments #Corona Crisis #Fathers Death

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు