ప్రభాస్ కి హీరోయిన్ గా అవకాశం అంటూ హీరోయిన్ కి ఫేక్ కాల్!  

Raahu Heroine Kriti Garg Gives Clarity On Her Missing Case - Telugu Cyber Crime, Missing Case, Raahu Heroine Kriti Garg Gives Clarity, Sandeep Reddy Vanga, Tollywood

హీరోయిన్ కావాలని ఇండస్ట్రీలో అడుగుపెట్టే వారికి చాలా మంది సినిమా అవకాశాలు పేరు చెప్పి మోసం చేస్తూ ఉంటారు.అన్ని ఇండస్ట్రీలో ఈ రకమైన మోసాలు జరుగుతాయి.

Raahu Heroine Kriti Garg Gives Clarity On Her Missing Case

తరువాత సక్సెస్ అయిన హీరోయిన్స్ తన కెరియర్ ఆరంభంలో అవకాశాల పేరుతో ఎలా మోసపోయింది చెబుతూ ఉంటారు.అయితే ఇలాంటి మోసాలు అప్పుడప్పుడు హీరోయిన్స్ గా చేస్తున్న వారికి కూడా జరుగుతూ ఉంటాయి.

ఎవరో మోడల్ కోఆర్డినేటర్స్ ద్వారా హీరోయిన్స్ ఫోన్ నెంబర్లు సంపాదించి కొంత మంది ఆకతాయిలు, లేదంటే ప్లాన్డ్ గా ఫోన్ చేసి ఆఫర్ ఉంది ఆడిషన్ కి రావాలని చెప్పి హ్యాండ్ ఇస్తూ ఉంటారు.ఇప్పుడు అలాంటి అనుభవం రాహు అనే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన కృతి గార్గ్ అనే హీరోయిన్ గా ఎదురైంది.

అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పేరుతో ఆమెకి ఫోన్ వచ్చింది.ప్రభాస్ సినిమాలో ఆఫర్ ఉందని చెప్పి మాట్లాడేందుకు ముంబ రావాలని చెప్పారు.రాహు సినిమా దర్శకుడు కూడా ఆ వ్యక్తితో మాట్లాడాడు.తరువాత ఆమె ముంబై వెళ్ళింది.

తరువాత ఆమెకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో దర్శకుడు సుబ్బు పోలీసులకి ఫిర్యాదు చేశాడు.ఈ విషయం సంచలనంగా మారడంతో తరువాత ఆమె వీడియో కాల్ ద్వారా తాను క్షేమంగా ఉన్నట్లు చెప్పింది.

నాకు సందీప్ రెడ్డి వంగా పేరుతో ఓ వ్యక్తి ఫోన్ చేసి సినిమాలో ఆఫర్ ఉందని చెప్పిన మాట నిజమే.కానీ నేను ఆ మాటలు నమ్మలేదు.

నేను సేఫ్‌గానే ఉన్నాను.నేను సురక్షితంగా ఉండాలన్ని కోరుకున్న ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు’ అని తెలిపారు.

దర్శకుడు ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు.ఆ అజ్ఞాత వ్యక్తి ఫోన్ నెంబర్‌ను ట్రేస్ చేసారని, అది అనంతపురానికి చెందిన నరేష్ అనే వ్యక్తి నెంబర్‌ గా గుర్తించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Raahu Heroine Kriti Garg Gives Clarity On Her Missing Case Related Telugu News,Photos/Pics,Images..

footer-test