బంగార్రాజు సక్సెస్ వెనుక సీఎం జగన్.. ఆర్.నారాయణమూర్తి కామెంట్స్ వైరల్!

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఏపీలోని థియేటర్లలో తక్కువ టికెట్ రేట్లను అమలు చేస్తుండటంపై హీరోల్లో, దర్శకనిర్మాతల్లో, ప్రజల్లో భిన్నాభిప్రాయాలు నెలకొన్న సంగతి తెలిసిందే.కొన్నిరోజుల క్రితం నాగార్జున నటించిన బంగార్రాజు మూవీ థియేటర్లలో విడుదలైంది.

 R Narayanamurthy Viral Comments On Bangarraju Success Due To Cm Jagan Details, B-TeluguStop.com

తాజాగా ఈ సినిమా సక్సెస్ సంబరాలు రాజమండ్రిలో గ్రాండ్ గా జరిగాయి.నాలుగు రోజుల్లోనే బంగార్రాజు సినిమా 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించడంతో ఈ సినిమా హీరో, నిర్మాత నాగార్జున సంతోషిస్తున్నారు.

ఐదు రోజుల్లో ఈ సినిమా 32.80 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.రాజమండ్రిలో జరిగిన బంగార్రాజు సక్సెస్ మీట్ కు ఆర్.నారాయణ మూర్తి అతిథిగా హాజరై చిత్రబృందాన్ని అభినందించారు.ఆర్.నారాయణ మూర్తి సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ తాను ఏఎన్నార్ అభిమానినని చెప్పారు.బంగార్రాజు ఈ స్థాయిలో సక్సెస్ కావడానికి ఏఎన్నార్ ఆశీస్సులు కారణమని నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు.

దర్శకుడు కళ్యాణ్ కృష్ణ బంగార్రాజు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని నారాయణమూర్తి చెప్పుకొచ్చారు.

Telugu Ap Cm Jagan, Ap, Bangarraju, Bangarraju Meet, Curfew, Kalyan Krishna, Nag

శ్రీరామదాసు, అన్నమయ్య సినిమాలలో నటించడం ద్వారా నాగార్జున జన్మధన్యం చేసుకున్నారని నారాయణమూర్తి పేర్కొన్నారు.బంగార్రాజు మూవీలో చైతన్య ఇంత బాగా చేస్తాడని అనుకోలేదని చైతన్య వరుస విజయాలతో దూసుకెళుతున్నాడని నారాయణమూర్తి కామెంట్లు చేశారు.

Telugu Ap Cm Jagan, Ap, Bangarraju, Bangarraju Meet, Curfew, Kalyan Krishna, Nag

దర్శకుడు కళ్యాణ్ కృష్ణలో నాకు కె.రాఘవేంద్రరావు కనిపించారని నారాయణమూర్తి చెప్పుకొచ్చారు.ఈ సినిమా సక్సెస్ ఏపీ సీఎం జగన్ ది కూడా అని నారాయణమూర్తి తెలిపారు.సీఎం జగన్ కర్ఫ్యూను వాయిదా వేయడం ద్వారా సినిమా ఇండస్ట్రీని కాపాడారని నారాయణమూర్తి అన్నారు.

నాలుగు రోజుల్లో బంగార్రాజు మంచి కలెక్షన్లను సొంతం చేసుకుందని నారాయణమూర్తి చెప్పుకొచ్చారు.బంగార్రాజు సినిమా ఈ వీకెండ్ కూడా మంచి కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

నాగ్, నాగచైతన్యకు బంగార్రాజు మూవీ ప్లస్ అయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube