గత కొన్ని రోజులుగా ఆర్ నారాయణమూర్తి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని జోరుగా కథనాలు ప్రచారంలోకి వస్తున్న సంగతి తెలిసిందే.పీపుల్స్ స్టార్ ఆర్థిక ఇబ్బందుల గురించి తెలిసి ఆయన అభిమానులు సైతం కంగారు పడ్డారు.
అయితే వైరల్ అవుతున్న ప్రచారం గురించి స్పందించి నారాయణమూర్తి వివరణ ఇచ్చారు.గద్దర్ తనపై అభిమానంతో తాను ఇంటి అద్దె కట్టలేని స్థితిలో ఉన్నానని చెప్పారని అందులో వాస్తవం లేదని నారాయణమూర్తి అన్నారు.
తాను కేవలం స్వేచ్ఛ కోరుకుని మాత్రమే నగర శివార్లలో ఉంటున్నానని నారాయణమూర్తి చెప్పుకొచ్చారు.తాను హైదరాబాద్ సిటీలో ఆటోలో ప్రయాణం చేయడం కొరకే రోజుకు 1,000 రూపాయల చొప్పున నెలకు 30,000 రూపాయలు ఖర్చు చేస్తున్నానని తన ఆర్థిక స్థితి గురించి నారాయణమూర్తి వెల్లడించారు.
కొంతమంది ప్రభుత్వ అధికారులు గతంలోనే తనకు ఇల్లు మంజూరు చేస్తామని చెప్పినా తాను నో చెప్పానని నారాయణమూర్తి పేర్కొన్నారు.
తన ఆర్థిక పరిస్థితి గురించి జరుగుతున్న ప్రచారం బాధ కలిగించిందని నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో తాను కొన్ని హిట్ మూవీలను తెరకెక్కించానని నారాయణమూర్తి వెల్లడించారు.తనకు అవసరమైతే సాయం చేసే ఫ్రెండ్స్ ఉన్నారని నారాయణమూర్తి చెప్పుకొచ్చారు.
అయితే స్నేహితులను ఉపయోగించుకోవడం తనకు నచ్చదని ఆయన అన్నారు.తన ఆర్థిక పరిస్థితి గురించి తప్పుగా ప్రచారం చేయవద్దని నారాయణమూర్తి చెప్పుకొచ్చారు.
దర్శకనిర్మాతగా ఆర్ నారాయణమూర్తి ఎన్నో సినిమాలను తెరకెక్కించగా ఆయన సినిమాలో కొన్ని సినిమాలు సక్సెస్ సాధించాయి.కమర్షియల్ సినిమాల్లో భారీ రెమ్యునరేషన్ తో ఆఫర్లు వచ్చినా నారాయణమూర్తి వాటిని సున్నితంగా రిజెక్ట్ చేశారు.హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా తను నమ్మిన సిద్ధాంతాలనే సినిమాలుగా తెరకెక్కిస్తూ నారాయణమూర్తి ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకోవడం గమనార్హం.సినిమాల ద్వారా వచ్చిన లాభాలను సైతం నారాయణమూర్తి సొంత ఊరి కోసం ఖర్చు చేశారు.