అందుకే నాకు ఇప్పటికీ సొంత ఇల్లు, కారు లేవు.. కానీ....

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో పోరాట పటిమ గల చిత్రాలతో సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న తెలుగు ప్రముఖ సీనియర్ హీరో ఆర్. నారాయణ మూర్తి గురించి రెండు తెలుగు రాష్ట్రాలలో తెలియని వారుండరు. అయితే సినిమాల్లోకి రాకముందు ఆర్.నారాయణ మూర్తి ప్రజా సమస్యలపై పోరాటాలు చేసాడు. ఆ తరువాత తన చిత్రాల ద్వారా ప్రేక్షకులలో చైతన్యం తీసుకురావాలని ఎప్పుడూ కూడా సొంత లాభం ఆశించకుండా సినిమాలు చేస్తూ ఎంతగానో అలరించాడు.అంతేగాక తన మొత్తం జీవితాన్ని ప్రజా సేవకే అంకితం చేసినటువంటి ఆర్.నారాయణ మూర్తి ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా బ్రహ్మ చారిగానే ఉండిపోయారు.అయితే తాజాగా ఆర్. నారాయణ మూర్తి  ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

 R.narayana Murthy React About Why He Don't Have Own Home And Car Still Now, R.na-TeluguStop.com

ఇందులో భాగంగా ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఎప్పుడూ ప్రజా సమస్యలపై పోరాటం చేసేటువంటి ఆర్. నారాయణ మూర్తి గారికి కనీసం ఇప్పటివరకు ఒక సొంత, ఇల్లు కారు కూడా ఎందుకు లేవని ప్రశ్నించాడు. దీంతో ఆర్. నారాయణ మూర్తి ఈ విషయంపై స్పందిస్తూ తన మొత్తం జీవితాన్ని ప్రజా సమస్యల పోరాటాలకి అంకితం చేశానని దాంతో ఎప్పుడూ కూడా తన గురించి ఆలోచించ లేదని అందువల్లనే ఇప్పటివరకు ఒక సొంత ఇల్లు, కారు కూడా సంపాదించుకోలేక పోయానని తెలిపాడు. అయితే ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు తనకంటూ ఒక సొంత ఇల్లు ఉంటే బాగుండేదని అనిపిస్తుందని కానీ ఇప్పుడు అది సాధ్యపడదని తెలిపాడు.

కానీ ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలని వయసు మళ్లిన తర్వాత అనుకొని బాధపడడంలో ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పుకొచ్చాడు.పెళ్లి అనేది యుక్త వయసులో ఉన్నవారికి అవసరమే అయినప్పటికీ కానీ వయసు మళ్ళిన తర్వాత మాత్రం అవసరం, ఆసరాగా మాత్రమే కాకుండా తోడుగా కూడా ఉంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

అంతేకాక తాను ఒకప్పుడు సినిమాలు తీయాలని పరిశ్రమకు వచ్చినప్పుడు తన స్నేహితులు, ఆప్తులు ఆర్థిక సహాయం చేసి ఎంతగానో ఆదరించారని వారి మేలు ఈ జన్మలో మర్చిపోలేనిదని కూడా తెలిపాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఎప్పుడు పోరాట పటిమ గల చిత్రాలలో నటిస్తూ కమర్షియల్ చిత్రాలకు దూరంగా ఉంటున్న సీనియర్ నటుడు, దర్శకుడు మరియు నిర్మాత ఆర్. నారాయణ మూర్తి ఇప్పటికీ హాస్టల్ లోనే జీవనం గడుపుతున్నాడు.అంతేకాక ఎక్కడికి వెళ్ళినా ఆటోలో  లేదా కాలి నడకన వెళుతుంటాడు.

కానీ ఇప్పటికీ చాలా మంది దర్శక నిర్మాతలు తమ చిత్రాల్లో ఆర్. నారాయణ మూర్తి నటిస్తే లక్షల్లో రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.కానీ ఆర్. నారాయణ మూర్తి మాత్రం సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లోనే కమర్షియల్ చిత్రాల్లో నటించకూడదని నిశ్చయించుకున్నాడు. అందువల్లనే ఆ మధ్య ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకతవం వహించిన టెంపర్ చిత్రంలో తనకు నటించే అవకాశం ఇచ్చినప్పటికీ సున్నితంగా ఆర్. నారాయణ మూర్తి మాత్రం సున్నితంగా తిరస్కరించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube