పెళ్లి చేసుకోకుండా తప్పు చేశానేమో...

సమాజంలోని ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ, అలాగే ప్రజా సమస్యల పట్ల తన చిత్రాలతో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఎలాంటి లాభం ఆశించకుండా తన జీవితం మొత్తాన్ని ప్రజా సేవకి ధార పోసిన ప్రముఖ నటుడు ఆర్. నారాయణ మూర్తి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే తాజాగా ఆర్.నారాయణ మూర్తి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో  తన పెళ్లి గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 R Narayana Murthy, Tollywood Senior Hero,  Marriage News, Tollywood News, Tollyw-TeluguStop.com

అయితే ఇందులో తాను ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా పెళ్లికి దూరంగా ఉండాలని అనుకున్న మాట వాస్తవమే కానీ ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు తాను పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేదని అనిపిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.అంతేగాక జీవితంలో తనకు ఒక తోడు ఉంటే బాగుండేదని ఓ రోజు సాయంత్రం వేళలో తన బాల్కనీలో ఉండగా రెండు పక్షులను చూసి అలా అనిపించిందని చెప్పుకొచ్చాడు.

అంతేగాక సమాజ సేవ కోసం తాను కోట్ల రూపాయల డబ్బుని వద్దనుకున్నానని, అంతేగాక రాజకీయాల పరంగా కూడా ఎమ్మెల్యే, ఎంపీ సీట్లను కూడా వదిలేశానని తన పూర్తి జీవితం ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి అంకితం చేశానని చెప్పుకొచ్చాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా సినిమాల పరంగా కూడా కమర్షియల్ సినిమాలలో నటించనని ఆర్.నారాయణమూర్తి అప్పట్లోనే తెగేసి చెప్పాడు.  అందువల్లనే టాలీవుడ్ ప్రముఖ రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన టెంపర్ అనే చిత్రంలో నిజాయితీ గల కానిస్టేబుల్ పాత్రలో నటించే అవకాశం ఇచ్చినప్పటికీ ఆ చిత్రం కొంతమేర కమర్షియల్ తరహాలో ఉండడం వల్ల ఆర్.నారాయణ మూర్తి ఆ చిత్రంలో నటించనని చెప్పానని దర్శకుడితో చెప్పినట్లు గతంలో కొన్ని సందర్భాలలో చెప్పుకొచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube