Hero Madhavan : ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోవాలని అనుకున్న మాధవన్.. అమ్మతో కూడా చెప్పానంటూ?

ఒకప్పటి హీరో మాధవన్( Hero Madhavan ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈ తరం ప్రేక్షకులకు అంతగా తెలియక పోయినప్పటికీ ఆ తరం ప్రేక్షకులను ఇట్టే గుర్తుపట్టేస్తారు.

 R Madhavan Recalls He Wanted To Marry Actress Juhi Chawla After Watched Qayamat-TeluguStop.com

సఖి సినిమాతో అప్పట్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగాడు.కానీ ఆ తర్వాత ఆయన నటించిన చిత్రాలు అంతగా మెప్పించలేకపోయాయి.

వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.చివరిసారిగా రాకెట్రీ చిత్రంలో కనిపించిన మాధవన్, ప్రస్తుతం ఓటీటీలో వెబ్ సిరీస్ చేస్తున్నాడు.

ప్రస్తుతం రైల్వే మెన్( The Railway Men ) అనే వెబ్ సిరీస్ లో నటించాడు.ఇందులో జూహీ చావ్లా నటించింది.

ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

Telugu Juhi Chawla, Qayamatse, Madhavan, Railway Web-Movie

ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఇటీవలే ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న మాధవన్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.కెరీర్ తొలినాళ్లలో తాను జూహ్లీ చావ్లా( Juhi Chawla )ను పెళ్లి చేసుకోవాలనుకున్నానని అదే విషయాన్ని తన తల్లితో కూడా చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు.ప్రస్తుతం మాధవన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా ఈ సందర్బంగా మాధవన్ మాట్లాడుతూ.నేను అందరి ముందు ఈ నిజాన్ని ఒప్పుకోవాలనుకుంటున్నాను.

ఖయామత్ సే ఖయామత్ సినిమా చేసి జూహీ చావ్లాను పెళ్లి చేసుకోవాలనుకున్నాను.అప్పట్లో ఆమెను పెళ్లి చేసుకోవడమే నా ఏకైక లక్ష్యం.

ఇదే విషయాన్ని మా అమ్మతో కూడా చెప్పాను అని చెప్పుకొచ్చాడు.అలాగే తన జూహీతో కలిసి సినిమా చేసే అవకాశమే రాలేదు అని తెలిపారు.

Telugu Juhi Chawla, Qayamatse, Madhavan, Railway Web-Movie

హిందీలో మన్సూర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఖయామత్ సే ఖయామత్ తక్( Qayamat Se Qayamat Tak ) మూవీలో అమీర్ ఖాన్, జూహీ కలిసి నటించారు.1988లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.అప్పట్లో భారీ వసూళ్లు రాబట్టిన సినిమా కూడా ఇదే.ఈ సినిమాతోనే ఉత్తమ నటి తెరంగేట్రం అవార్డు సహా ఎనిమిది ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకుంది.ఖయామత్ సే ఖయామత్ తక్ విడుదలైనప్పుడు మాధవన్ ఇంకా నటుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టలేదు.సఖి సినిమా( Sakhi Movie )తో హీరోగా వెండితెరకు పరిచయమైన మాధవన్.ఆ తర్వాత తమిళంలో అనేక హిట్ చిత్రాల్లో నటించారు.2001లో రెహానా హై టెర్రే దిల్ మేతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.గతేడాది వచ్చిన రాకెట్రీ సినిమాతో దర్శకుడిగా మారారు మాధవన్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube