టీఆర్ఎస్ లోకి ఆర్. కృష్ణయ్య ? కేసీఆర్ ఆఫర్ ఇదేనంటూ ...?

తెలంగాణలో హుజూరాబాద్ ఎన్నికల విషయమై వాడివేడిగా రాజకీయ వాతావరణం ఉంది టీఆర్ఎస్ ,బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రజల్లో పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.ముఖ్యంగా టీఆర్ఎస్ బీజేపీలు ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తూ ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.

 R Krishnayya Try To Join In Trs R Krishnayya, Trs, Hujurabad, Elections, Etela R-TeluguStop.com

ఈ రెండు పార్టీల మధ్య వివాదం నెలకొనడంతో,  ఒక పార్టీలోని నేతలను మరో పార్టీలో చేర్చుకుంటూ బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఒకపక్క పరిస్థితి ఏవిధంగా ఉంటే ,మరోవైపు టిఆర్ఎస్ మరింత వేగంగా తెలంగాణలో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.

     దీనిలో భాగంగానే బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ను టీఆర్ఎస్ లో చేర్చుకోబోతున్నారు అనే వార్తలు ఇప్పుడు తెలంగాణలో వైరల్ గా మారాయి.ప్రస్తుతం ఆర్.కృష్ణయ్య బీసీ సంఘం అధ్యక్షుడిగా యాక్టివ్ గా ఉంటున్నారు .ఈ క్రమంలోనే ఆయనను చేర్చుకుంటే తమకు కలిసి వస్తుందనే లెక్కల్లో టిఆర్ఎస్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.ఇక ఆర్.కృష్ణ విషయానికి వస్తే 2014 ఎన్నికలకు ముందు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు.ఆయనను తెలంగాణ సీఎం అభ్యర్థిగానూ చంద్రబాబు ప్రకటించారు.

ఎల్బీనగర్ నుంచి ఆర్.కృష్ణయ్య పోటీ చేసి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు.అయితే టిడిపి కి పెద్దగా అసెంబ్లీ స్థానాలు రాకపోవడంతో , తెలంగాణలో టిడిపి అధికారంలోకి రాలేకపోయింది.ఇక ఆ తరువాత తరువాత ఆయన రాజకీయల్లో యాక్టివ్ గా లేరు.

చివరకు 2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ ని గెలిపించాలని ఆర్ కృష్ణ పిలుపునిచ్చారు.
 

Telugu Etela Rajendar, Hujurabad, Krishnayya, Krishnayya Mlc, Telangana Cm-Telug

   ఇక చాలా కాలంగా టిఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు గానే కనిపించారు.అయితే ఇప్పుడు ఆర్.కృష్ణయ్య ను టీఆర్ఎస్ లో చేర్చుకునే విషయంపై ఆయనతో చర్చలు జరిగాయని, ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు కేసీఆర్ అంగీకరించారనే ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో ఉధృతం అయింది కేసీఆర్ తో చర్చలు జరిపింది మంత్రి గంగుల కమలాకర్ తో పాటు మాజీ ఎంపీ వినోద్ కుమార్ అనే వార్తలు వస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube