సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆర్. కృష్ణయ్య..!!

నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో స్థానిక జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యక్రమానికి వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ దేశంలోనే బీసీలకు సముచిత స్థానం కల్పించిన ముఖ్యమంత్రి సీఎం జగన్ మాత్రమే అని తెలిపారు.

 R. Krishnayya Sensational Comments On Cm Jagan R. Krishnayya, Ap Cm Jagan, Ap Poltics ,-TeluguStop.com

దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటినుండి రెండు బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉందని మండిపడ్డారు.కానీ వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక భారత పార్లమెంటులో మొట్టమొదటిసారిగా బీసీ బిల్లు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని స్పష్టం చేశారు.

అయితే బిల్లు కోసం దాదాపు 15 పార్టీల మద్దతు కూడగట్టాలని కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సపోర్ట్ చేయకపోవడంతో .పార్లమెంట్ లో బీసీ బిల్లు వీగిపోయిందని తెలిపారు.అయినా కానీ బీసీ బిల్లు విషయంలో వెనక్కి తగ్గేదే లేదని పోరాడటానికి సిద్ధంగా ఉన్నట్లు ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు.ఈ బిల్లు విషయంలో బీసీ సోదరులు కూడా పోరాడటానికి రెడీగా ఉండాలని తెలిపారు.బీసీలకు రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గిస్తే… ఏపీలో దేశంలో ఎక్కడా లేని విధంగా చట్టసభల్లో 44 శాతానికి పెంచిన ఘనత సీఎం వైఎస్ జగన్ కే దక్కుతుందని తెలిపారు.

 R. Krishnayya Sensational Comments On CM Jagan R. Krishnayya, AP CM Jagan, Ap Poltics , -సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆర్. కృష్ణయ్య..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ కార్యక్రమంలో స్థానిక బీసీ నాయకులు ఆర్.కృష్ణయ్య ను… పుష్పగుచ్చాలతో.గజమాలతో సత్కరించడం జరిగింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube