40 ఏళ్ల వయస్సులో బరువు తగ్గటానికి అద్భుతమైన చిట్కాలు  

వయస్సు పెరిగే కొద్ది అనేక రకాలైన సమస్యలు వస్తూ ఉండటం సహజమే. ఆ సమస్యలను తగ్గించుకొని ముందుకు సాగితే జీవితం హ్యాపీగా ఉంటుంది. 40 ఏళ్ల వయస్సు వచ్చే సరికి బరువు అనేది పెద్ద సమస్యగా మారుతుంది. బరువు ను తగ్గించుకోవటం ఆ వయస్సులో చాలా కష్టం. 40 ఏళ్ల వయస్సులో బరువు తగ్గటం అనేది చాలా కష్టం. ఈ చిట్కాలను పాటిస్తే ఖచ్చితంగా బరువు తగ్గుతారు.

పండ్లను,కూరగాయలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటే వాటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మెటబాలిక్ రేట్ ను పెంచుతాయి. దాంతో శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది.

-

తక్కువ ఆహారాన్ని ఎక్కువ సార్లు తీసుకుంటూ ఉండాలి. అలాగే తీసుకొనే ఆహారంలో పోషకాలు సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి. అయితే డైట్ విషయంలో ఒక్కసారి డాక్టర్ ని సంప్రదిస్తే మంచిది.

వయస్సు రీత్యా మెటబాలిజంలో మార్పులు వస్తూ ఉంటాయి. ఆ మార్పులను తట్టుకోవాలంటే బయట ఆహారాలను మానేసి ఇంటి ఆహారాలను తీసుకోవాలి. మెటబాలిజంలో తేడా ఉన్నా బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి.

ముఖ్యమైన విషయం ఏమిటంటే ఉదయం బ్రేక్ ఫాస్ట్ అసలు మానకూడదు. తప్పనిసరిగా తినాలి. ఒకవేళ బ్రేక్ ఫాస్ట్ మానేస్తే ఆ ప్రభావం మెటబాలిజం మీద పడి బరువు పెరిగే అవకాశం ఉంది.

40 ఏళ్ల వయస్సు వచ్చేసరికి వ్యాయామం చేయాలి. ప్రతి రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉంటే బరువు కూడా అదుపులో ఉంటుంది. ప్రతి రోజు 40 నిమిషాల పాటు సమయాన్ని వ్యాయామం కోసం కేటాయించాలి.