పాలిటెక్నిక్ కాలేజీలో కలకలం రేపుతున్న ప్రశ్నాపత్రం లీక్ ఘటన.. ?

అవినీతి అనేది మందులేని, కనిపెట్టలేని మాయదారి రోగం.ఈ పనికి పాల్పడే వారు బాగానే ఉంటారు కానీ దీని బాధితులు మాత్రం పూర్తిగా అన్యాయం అయిపోతారు.

 Question Paper Leak Incident In Polytechnic College-TeluguStop.com

ప్రస్తుతం సమాజంలో క్రింది స్దాయి నుండి ఉన్నత స్దాయివరకు వేళ్ళూనుకున్న ఈ విష బీజం అంతమవడం అసాధ్యం.అడుగడుగునా అవినీతి తొత్తులు కనిపిస్తారు.

ఇకపోతే గుంటూరు జిల్లా బాపట్ల ఇంజినీరింగ్ కాలేజీ అవినీతి తిమింగళాలు చేసినపని వల్ల విద్యార్ధుల భవిష్యత్తు అయోమయంలో పడిపోయింది.అసలే కరోనా వల్ల సాగుతున్న చదువులు అంతంత మాత్రమే ఇలాంటి సమయంలో సెకండ్ షిఫ్ట్ పాలిటెక్నిక్ కాలేజీలో ఎగ్జామ్ కు ముందు ప్రశ్నాపత్రం లీక్ కావడం కలకలం రేపుతుంది.

 Question Paper Leak Incident In Polytechnic College-పాలిటెక్నిక్ కాలేజీలో కలకలం రేపుతున్న ప్రశ్నాపత్రం లీక్ ఘటన.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉండగా మెకానికల్ ఇంజినీరింగ్ 2వ సంవత్సరం 3వ సెమిస్టర్ బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ పరీక్ష ఈ నెల 6న నిర్వహించారు.కాగా ఎగ్జామ్ కు అరగంట ముందే ప్రశ్నాపత్రం పలువురు విద్యార్థుల సెల్ ఫోన్ లో చక్కర్లు కొట్టడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

అసలు విషయాన్ని ఆరా తీయగా విద్యార్థుల నుంచి రూ.వేలలో డబ్బులు వసూలు చేసి ఓ అధ్యాపకురాలు ఈ పని చేసినట్లు అనుమానిస్తూ కొందరు రాష్ట్ర సాంకేతిక విద్యామండలి కార్యదర్శి విజయభాస్కర్ కు ఫిర్యాదు చేయగా, ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టుగా సమాచారం.

#Guntur #Bapatla #QuestionPaper

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు