అందరినీ ప్రశ్నించండి.. ఎవరిని వదిలిపెట్టదు: పూరీ

ప్రముఖ తెలుగు దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమాలు అందించడమే కాకుండా.జీవితం గురించి ప్రజలకు కొన్ని విషయాలు నేర్పుతున్నారు.

 Question Everything By Puri Jagannadh, Puri Musings, Tollywood, Question Everyth-TeluguStop.com

ప్రతి ఒక్క విషయంలో ప్రజలు ధైర్యంతో ముందుకు ఉండాలని అంటున్నారు.తాజాగా ‘క్వశ్చన్ ఎవ్రీథింగ్’ అనే అంశంపై ‘పూరి మ్యూజింగ్స్‘ వేదికగా కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు.

జీవితంలో ప్రతి విషయాన్ని, ప్రతి ఒక్కరినీ ప్రశ్నించాలని దర్శకుడు పూరి తెలుపుతున్నాడు.ప్రశ్నించడం వల్ల ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు అంటున్నారు.ఎందుకు? ఏమిటి? ఎక్కడ? ఎప్పుడు? ఎలా? ఎందుకలా.వీటి ద్వారానే మన చిన్నతనం ప్రారంభమవుతుందని, మాటలు నేర్చుకునే దగ్గర్నుంచి ప్రశ్నలు మొదలవుతాయని బాగా తెలిపాడు.

ఇక అందులో తల్లిదండ్రులు పిల్లలకు కొన్నిటికి సమాధానం చెబుతారు.మరికొన్నింటికి చెప్పరు.కొన్ని ప్రశ్నలతో మన నోరు నొక్కేస్తారని అంటున్నారు.ఇక ఎవరైనా మిమ్మల్ని ‘అలా అడక్కు కుళ్లి పోతాయి’ అని అంటుంటే ఆ మాటను గుర్తుపెట్టుకోండి అంటున్నారు.

ఎందుకంటే అక్కడ ఏదో తేడా ఉందని అర్థం అని.దానివల్ల ప్రతిదానికి ప్రశ్నించాలని, అలా ప్రశ్నిస్తే నేర్చుకుంటామని అంటున్నారు.అమాయకంగా, నవ్వుతూ ప్రశ్న అడగమని.మంచి ప్రశ్న నుంచి మంచి సమాధానం ఉంటుంది కానీ చెత్త ప్రశ్న నుంచి మంచి సమాధానం ఎప్పటికీ రాదని తెలిపారు.

Telugu Puri Jagannadh, Puri, Tollywood-Movie

మేము అడిగే ప్రశ్న బట్టి అవతలి వ్యక్తి ఆలోచనలు పడిపోవాలి అంటూ, ఎవరిని వదిలిపెట్టవద్దని, ఎందుకంటే ఈ ప్రపంచంలో చాలావరకు అబద్ధపు సిద్ధాంతాల కోసం పోరాటం చేస్తున్నారని, వాటితోనే బతుకుతున్నారని తెలుపుతున్నారు.అంతేకాకుండా అలాంటి యుద్ధాల జోలికి వెళ్లవద్దని, గుడ్డిగా నమ్మితే అటువంటి యుద్ధాల్లో కూడా ఒకరిగా ఉండాల్సి ఉంటుందని తెలిపారు.

వాటి నుంచి బయటికి రావాలంటే ప్రశ్నించాలని, కానీ ఏదో ఒక రోజు అందరిలో మొదలైన ప్రశ్నలు ఒకరోజు ఆగిపోతాయని, అప్పుడు మాట్లాడటం, అడగడం లాంటివే మానేస్తానని అంటున్నారు.దానినే జ్ఞానోదయం అంటారని, అది రాకపోయినా నష్టం లేదని.

కానీ ఒక తప్పుని నిజం అని ఎప్పటికీ నమ్మవద్దని.ఒక్కసారి మీ నమ్మకాలను పరిశీలించండి అని తెలిపారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube