అక్కడ స్వలింగ సంపర్కులు పిల్లల్ని దత్తత తీసుకోవచ్చు

స్వలింగ సంపర్కం అంటే పెద్ద బూతు మన భారతీయ సమాజంలో.ఇక వారి హక్కుల గురించి పట్టించుకునే నాథుడే లేడు.

 Queensland Of Australia Allows Lgbt To Adopt Children-TeluguStop.com

మరోవైపు, పరాయి దేశాలు మాత్రం ఒకటిదాని తరువాత ఒకటి, స్వలింగ సంపర్కుల కోసం హక్కులు, సంరక్షణ అందించడానికి తమ న్యాయవ్యవస్థలో అవసరమైన మార్పులు చేస్తూపోతున్నాయి.

తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన క్వీన్స్ లాండ్ అనే రాష్ట్రం, స్వలింగ సంపర్కలు పిల్లలను దత్తత తీసుకునే అవకాశాన్ని కలిపిస్తూ, ప్రభుత్వం ద్వారా సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది.

ఈ టాపిక్ మీద చర్చ మొదలైనప్పటినుంచి రకరకాల భిన్న స్పందనలు వినిపించినా, ఆ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏమి పట్టించుకోకుండా స్వలింగ సంపర్కులకు పిల్లల్ని దత్తత తీసుకునే హక్కు కట్టబెట్టింది.అయితే ఆస్ట్రేలియా మొత్తానికి ఈ నిర్ణయం వర్తించదు.

కాని, టస్మానియా, విక్టోరియా, వెస్టెర్న్ ఆస్ట్రేలియా, న్యూ సౌత్ వెల్స్ లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ హక్కులు అమలులో ఉన్నాయి.

ఇంతకుముందు, స్వలింగ సంపర్కులు దత్తత తీసుకునేలా అర్జెంటీనా, ఆస్ట్రియా, బెల్జియం, బ్రెజిల్, కెనెడా, ఫ్రాన్స్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, అమెరికా లాంటి దేశాలు తమ చట్టాలను సవరించాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube