వైరల్‌ : 93 ఏళ్ల వయసులో కూడా బ్రిటన్‌ రాణిగారి చమత్కారం తగ్గలేదు

కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రపంచ వ్యాప్తంగా రాచరికపు పాలన కొనసాగేది.కాలక్రమేనా రాచరికపు పాలన కనుమరుగయ్యింది.

 Queen Elizabeth Ii Hilariouslypranked Tourists Queen-TeluguStop.com

ప్రస్తుతం దాదాపుగా ప్రపంచం మొత్తం కూడా ప్రజాస్వామ్యబద్దంగా పరిపాలన కొనసాగుతోంది.అయితే అప్పటి రాజులు, రాచ కుటుంబాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

రాజ కుటుంబం అనగానే ఠక్కున వినిపించేది బ్రిటన్‌ రాజవంశం.అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా తమ సామ్రాజ్యంను వ్యాప్తి చేసేందుకు బ్రిటీష్‌ వారు ఏ స్థాయిలో ప్రయత్నించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇండియాతో పాటు చాలా దేశాలు కూడా బ్రిటన్‌ పాలనలో ఉన్నాయి.

Telugu Queen Elizabeth, Queenelizabeth-

అప్పట్లో బ్రిటన్‌ రాణి గారి ఆదేశాల అనుసారంగానే దేశాలను ఆక్రమించుకోవడం, ఆ తర్వాత ఆయా దేశాలకు స్వాతంత్య్రం ఇవ్వడం జరిగింది.ప్రస్తుతం అలాంటి పరిస్థితులు ఏమీ లేవు.ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ఎక్కువ శాతం ఎవరికి వారే పరిపాలన కొనసాగించుకుంటున్నారు.

అంతటి విశిష్టత ఉన్న బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ 2 చాలా సరదా మనిషి అంటూ ఉంటారు.ఆమెకు ప్రస్తుతం 93 ఏళ్లు ఉంటాయి.ఈ వయసులో కూడా ఆమె చాలా సరదాగా అందరితో కలిసి పోయి తన రాచరికంను చాటుతూ ఉంటుంది.

ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు మరియు గౌరవం ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రపంచ దేశాల ప్రధానులు మరియు అధ్యక్షులు కూడా ఎలిజబెత్‌ 2 గారిని కలిసేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు.బ్రిటన్‌ వెళ్లిన ప్రతి ప్రముఖుడు కూడా తప్పకుండా ఆమెను కలవడంతో పాటు, ఆమెకు ప్రత్యేకంగా మర్యాదలు కూడా చేయడం జరుగుతుంది.

తాజాగా స్కాట్లాండ్‌కు చెందిన కొందరు సందర్శకులు లండన్‌ రాణి వారి ప్యాలెస్‌కు వెళ్లారు.అక్కడ రాణి గారిని కలిసేందుకు వెళ్తున్నారు.

ఆ సమయంలోనే వారికి ఒక వ్యక్తి ఎదురు అయ్యారు.ఆమెతో ఆ సందర్శకులు మాట్లాడుతూ మాటలో మాట వచ్చి మీరు ఇక్కడి వారేనా, మీరు ఎప్పుడైనా రాణి గారిని కలిశారా అంటూ ప్రశ్నించారు.

ఆ సందర్శకులు తాము ఎవరితో మాట్లాడుతున్నామో గుర్తించలేక పోయారు.ఆమె ఒక సాదారణ మహిళగా వారు భావించారు.

బయటి ప్రపంచంలో రాణి ఎలిజబెత్‌ అంటే ఒక గొప్ప నాయకురాలు.కాని వారు మాట్లాడిన వ్యక్తి అలా కనిపించక పోవడంతో ఆమె రాణి గారు అయినా కూడా వారు గుర్తించలేక పోయారు.

రాణి ఎలిజబెత్‌ వారి మాటలకు చిన్నగా నవ్వుకుని నేను ఇక్కడి వ్యక్తినే కాని నేను ఎప్పుడు కూడా రాణి గారిని చూడలేదు అంటూ చెప్పుకొచ్చింది.ఆ పక్కన ఉన్న ఒక సెక్యూరిటీ వ్యక్తిని చూపిస్తూ అతడికి బాగా తెలుసు అంటూ అక్కడ నుండి వెళ్లి పోయింది.

ఆ సందర్శకులు వెళ్లి మేము రాణి గారిని కలవాలి, ఆమె గురించి మీకు తెలిసింది చెప్పండి అంటూ కోరారు.ఇప్పటి వరకు మీరు మాట్లాడింది రాణి గారితోనే, ఆమె క్వీన్‌ ఎలిజబెత్‌ 2 అంటూ చెప్పాడు.

అతడి మాటలకు ఆ సందర్శకుల నుండి కనీసం మాట వచ్చే పరిస్థితి లేదు.ఆమె ఎంత సింపుల్‌గా ఉండటంతో పాటు, మమ్ములను ఆట పట్టించింది అంటూ వారిలో వారు నవ్వుకున్నారు.

ఆమె గొప్పదనం గురించి అభినందించారు.ఆమెను ఆతర్వాత కలిసి చాలా సమయం గడిపామంటూ సందర్శకుల్లో ఒకరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది.

క్వీన్‌ ఎలిజబెత్‌ 2 గురించి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన ఇంట్రెస్ట్‌ ఉంటుంది.తాజాగా ఆమె చమత్కారం కారణంగా మరింతగా ఆమెకు అభిమానులు అవుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube