విడ్డూరం : ఒక దున్నపోతు కోసం రెండు గ్రామాల మద్య రక్తపాతం

ఇప్పటి వరకు రెండు ఊర్ల మద్య ఎన్నో గొడవలు చూశాం.ఆస్తి తగాదాలు, ఫ్యాక్షన్‌ తగాదాలు, ప్రేమ విషయాల వల్ల రెండు ఊర్ల మద్య తగాదాలు జరగంగా చూశాం.

 Quarrel Between Two Villages For One Buffalo In Karnataka Shivamogga-TeluguStop.com

కాని కర్ణాటకలో రెండు ఊర్ల మద్య జరుగుతున్న తగాదా ప్రస్తుతం అందరికి నవ్వు తెప్పిస్తుంది.ఆ తగాదాను రెండు ఊర్ల పెద్దలు తేల్చలేక పక్క ఊరి పెద్దల వద్దకు వెళ్లినా కూడా వారు కూడా తీర్చలేక పోతున్నారు.

ఆ తగాదా గత కొన్ని నెలలుగా కొనసాగుతూనే ఉంది.అత్యంత విచిత్రమైన వింతైన తగాదా కారణంగా రక్తాలు కారేలా ఆ రెండు ఊర్ల జనాలు కొట్టుకుంటున్నారు.

Telugu Buffalo, Quarrelbuffalo, Telugu General-

  ఇంతకు ఆ రెండు ఊర్ల జనాలు కొట్టుకునేది ఎందుకో తెలుసా.దున్నపోతు కోసం.అవును రెండు ఊర్ల జనాలు కూడా ఒక్క దున్నపోతు కోసం మాది అంటే మాది అంటూ కొట్టుకుంటున్నారు.కర్ణాటకలో దున్నపోతులను గ్రామాల్లో ఆంబోతుల మాదిరిగా వదలడం ఆనవాయితిగా వస్తుంది.

అలా శివమొగ్గ జిల్లాలోని హరనపల్లి మరియు హోన్నాళ్లి గ్రామాలు దున్న పోతులను వదిలాయి.అయితే ఒక ఊరు దున్నపోతు మిస్‌ అవ్వడంతో రెండు ఊర్లకు కలిపి ఒకటే దున్నపోతు అయ్యింది.

చాలా రోజుల వరకు రెండు ఊర్లలో కూడా ఒకటే దున్నపోతు తిరుగుతుందన్న విషయాన్ని వారు గుర్తించలేదు.

Telugu Buffalo, Quarrelbuffalo, Telugu General-

  ఒక రోజు గొడవ మొదలైంది.ఆ దున్నపోతు మాది అంటే మాది అంటూ రెండు గ్రామాల ప్రజలు అనుకోవడం జరిగింది.రెండు గ్రామాల వారు కూడా దున్నపోతును దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

దున్నపోతుకు డీఎన్‌ఏ టెస్టు చేసేందుకు సిద్దం అయ్యారు.అయితే అమ్మవారికి బలివ్వబోతున్న దున్నపోతుకు రక్త పరీక్ష చేసేందుకు రక్తంను తీయడానికి మేము ఒప్పుకోము అంటూ గ్రామస్తులు అన్నారు.

ఆ దున్నపోతును దక్కించుకునేందుకు రెండు గ్రామాల ప్రజలు కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.ఒక గ్రామం దున్నపోతు ఉంటే మరో గ్రామం దున్న పోతు ఏమైంది అనే విషయాన్ని తెలుసుకునేందుకు పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఉన్నది ఏ ఊరు దున్నపోతు అనే విషయంలో క్లారిటీ రావడం లేదు.దాంతో విచారణ వాయిదా వేశారు.దీన్ని ఎలా పరిష్కరించాలో అర్థం కాక పెద్దలు కూడా జుట్టు పీక్కుంటున్నారు.ఈ వివాదంలో పోలీసులు కూడా ఎంటర్‌ అయ్యారు.

అయ్యారు.అయితే రెండు గ్రామాల ప్రజలు శాంతి యుతంగా దీన్ని పరిష్కరించుకుంటామని హామీ ఇచ్చి పోలీసులను వెనక్కు పంపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube