ఎన్నారై సర్టిఫికెట్ : “ఎన్నారై విద్యార్ధులకు” గుడ్ న్యూస్ చెప్పిన ఖతర్ లోని భారత ఎంబసీ..!!

భారత్ నుంచీ వివిధ దేశాలకు ఉన్నత చదువుల కోసం భారత విద్యార్ధులు చదువుకోవడం కోసం వలసలు వెళ్తుంటారు ఇది అందరికి తెలిసిందే.అయితే ఎంతో మంది విదేశీ విద్యార్ధులు సైతం భారత యూనివర్సిటీలలో చదువుకోవడానికి ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు.

 Qatar Indian Embassy Issued Nri Certificate Without Appointment , Indian Embass-TeluguStop.com

ఈ క్రమంలో ఆయా దేశాల విద్యార్ధులు అక్కడి ప్రభుత్వాలు ఇచ్చే అనుమతులతో కూడిన సర్టిఫికెట్ లు ఇక్కడ యూనివర్సిటీలలో అందజేస్తారు.అలాగే విదేశాలలో ఉండే మన భారత సంతతి ప్రవాసులు సైతం ఉన్నత చదువుల కోసం భారత్ లోని ప్రముఖ యూనివర్సిటీలలో దరఖాస్తులు చేసుకుంటారు.

అయితే ఈ సమయంలో వారికి తప్పనిసరి అవుతుంది ఎన్నారై సర్టిఫికెట్.

ఎన్నారై విద్యార్ధులు ఇండియాలో చదువుకోవాలంటే ఈ ఎన్నారై సర్టిఫికెట్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం.

భారత్ లోని ప్రతీ యూనివర్సిటీలలో ఎన్నారై కోటా ఉంటుంది ఈ కోటాలో ప్రవేశాలకు కేవలం ఎన్నారైలు మాత్రమే అవకాశం ఉంటుంది.అయితే ఖతర్ లో ఈ మధ్య కాలంలో భారత్ వెళ్లి చదువుకునే ఎన్నారైల సంఖ్య పెరిగిపోతోంది.

గడిచిన కొన్ని రోజులుగా ఈ సర్టిఫికెట్ కోసం లెక్కకు మించి అపాయింట్మెంట్ కోసం అభ్యర్ధనలు రాగా ఈ పరిస్థితులను గమనిచిన ఖతర్ లోని భారత ఎంబసీ కీలక నిర్ణయం తీసుకుంది.అందులో భాగంగా

ముందుగా ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా ఎన్నారై సర్టిఫికెట్ కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని, అన్ని వేళ్ళల్లో మధ్యాహనం 12:30 గంటల నుంచీ 1 గంట వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది ప్రతీ రోజు ఈ అరగంట సమయంలో ఎలాంటి ముందస్తు అపాయింట్మెంట్ లేకుండా దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపింది.అయితే ఈ అవకాసం కేవలం ఎన్నారై సర్టిఫికెట్ కు మాత్రమే వర్తిస్తుందని మిగిలిన సర్వీసులు అన్నిటికి ముందస్తు అపాయింట్మెంట్ తప్పనిసరని ప్రకటించింది.మరిన్ని సేవల కోసం ఎన్నారైల కోసం వెబ్ పోర్టల్ అందుబాటులో ఉంచింది.

https://indianembassyqatar.gov.in/indian_national_reg

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube