అక్టోబర్ 7వ తారీకు ఇజ్రాయెల్ భూభాగంలోకి ఆక్రమంగా చోరబడి పౌరులను సైనికులను హమాస్ ఉగ్రవాదులు దారుణంగా చంపడం తెలిసిందే.ఈ క్రమంలో కొంతమందిని బందీలుగా కూడా అపహరించడం జరిగింది.
దీంతో ఆ బందీలను రక్షించుకోవడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం గాజా పై దాడులకు పాల్పడుతుంది.ఈ క్రమంలో గాజాపై భారీ బాంబులతో విరుచుకుపడుతుంది.
ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు ప్రపంచ దేశాలు భయాందోళన చెందుతున్నాయి.ఆల్రెడీ ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించడం జరిగింది.
దీంతో అరబ్ దేశాలు ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఖండిస్తున్నాయి.ఇదే సమయంలో బంధీలుగా ఉన్నవారిని విడిపించడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి.
పరిస్థితి ఇలా ఉంటే తాజాగా రేపటి నుంచి హమాస్ బందీలు విడుదల మొదలు కానుందని ఖతర్ దేశం స్పష్టం చేసింది.ఇజ్రాయెల్ తో ఒప్పందాన్ని అనుసరించి కాల్పుల విరమణ దిశగా ఖతర్ జోక్యం చేసుకుంది.ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం 4:00 కల్లా 13 మంది బంధీలను ఇజ్రాయెల్ కు హమాస్ అప్పగించనున్నట్లు పేర్కొంది.ఒప్పందంలో భాగంగా బందీలను దశలవారీగా విడుదల చేయటానికి హమాస్ ఓకే చెప్పడం జరిగింది.
ఈ క్రమంలో నాలుగు రోజులపాటు కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకారం తెలిపింది.మొత్తం 240 మంది ఇజ్రాయెల్ పౌరులను హమాస్ ఉగ్రవాదులు అపహరించడం జరిగింది.