సెప్టెంబరా నవంబరా ? హుజురాబాద్ ఎన్నిక ఎప్పుడు ? 

అదిగో ఇదిగో అంటూ హడావుడి నడిచినా,  హుజురాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ మాత్రం వెలువడలేదు.కరోనా వైరస్ ప్రభావం, తెలంగాణ లో వరదలు, పండుగలు ఇలా అనేక కారణాలతో ఎన్నికల నోటిఫికేషన్ ను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది.

 Trs, Telangana, Kcr, Revanth Reddy, Hujurabad, Hujurabad Elections, Trs Party,-TeluguStop.com

దీంతో ఈ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నా, బిజెపి కాంగ్రెస్ లు ఢీలా పడ్డాయి.ఈటెల రాజేందర్ కు హుజూరాబాద్ నియోజకవర్గం లో పెద్ద ఎత్తున సానుభూతి ఉందని , దానిని ఓట్ల రూపంలోకి మలచుకుని మళ్లీ ఈ నియోజకవర్గంలో గెలవాలని ఆయన ప్లాన్ చేసుకున్నారు.

అయితే ఎన్నికల నోటిఫికేషన్ వాయిదా పడే కొద్దీ ప్రజల్లో సానుభూతి తగ్గుతుందనే భయము అటు రాజేందర్ తో పాటు,  తెలంగాణ బిజెపి నాయకులలోనూ నెలకొంది.అందుకే వీలైనంత తొందరగా ఎన్నికలకు వెళ్లాలని ఆ పార్టీ అభిప్రాయపడగా టిఆర్ఎస్ మాత్రం ఎన్నికలు ఆలస్యం అయితే ఫలితం అనుకూలంగా ఉంటుందనే అభిప్రాయంతో ఉంటూ వచ్చింది.

సరిగ్గా కేసీఆర్ ఢిల్లీ టూర్ కి వెళ్ళిన సమయంలోని ఈ ఎన్నికల నోటిఫికేషన్ వాయిదా పడడంతో , కేంద్రంలో బీజేపీ పెద్దల సహకారంతో కేసీఆర్ నోటిఫికేషన్ రాకుండా చక్రం తిప్పారు అనే అనుమానాలు కలిగాయి.ఇదిలా ఉంటే ఈ నెలలోనే ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందనే ప్రచారం తెలంగాణలో ఊపందుకుంది.

Telugu Hujurabad, Revanth Reddy, Telangana, Trs-Telugu Political News

ఈ రోజు కానీ , సెప్టెంబర్ 24న కానీ, అది కుదరకపోతే నవంబర్ లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది అనే ప్రచారం జరుగుతోంది.కానీ ఎన్నికల నోటిఫికేషన్ ఆలస్యమయ్యే కొద్దీ మాత్రం అందరిలోనూ టెన్షన్ పెరిగిపోతుంది.మరోవైపు చూస్తే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సర్వే మీద సర్వే చేయిస్తూ ఫలితం ఎలా ఉండబోతోంది అని అంచనా వేస్తున్నారు.దీనికి తగ్గట్టుగా సరికొత్త పథకాలను ప్రవేశపెడుతూ ఆదరణ పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube