వైరల్: దేవుడా.. టాయిలెట్ సీట్ పై కూర్చున్న వ్యక్తికి ఫ్యూజ్ లు ఎగిరేలా చేసిన పైథాన్..!

సాధారణంగా పామును చూస్తే ఎవ్వరికైనా భయమే.పాము, అనకొండ కనిపిస్తే చాలు భయంతో పరుగులు తీస్తారు.

 Python That Made The Fuses Fly For The Person Sitting On The Toilet Seat Austria-TeluguStop.com

మరి అటువంటి పాములతో సరదాగా ఆడుకుంటే అందరూ వారిని ఆశ్చర్యంగా చూస్తారు.చాాలా మంది పెంపుడు జంతువులను పెంచుకుంటూ ఉంటారు.

మన దేశంలో కూడా ఇలా జంతువులను పెంచుకునే వారు చాలా మందే ఉన్నారు.అయితే పాములు పెంచుకునేవారు విదేశాలలోనే ఎక్కువ మంది ఉన్నారు.

విదేశీయులకు పాములను పెంచుకోవడం అలవాటు.అలా ఓ వ్యక్తి ఫైథాన్ ను పెంచుకోవడం వల్ల అతని ప్రాణం మీదకే తెచ్చుకున్నాడు.

ఫైథాన్ ఓ వ్యక్తిపై దాడి చేసింది.అది కూడా టాయిలెట్ లో.తాజాగా ఈ ఘటన ఆస్ట్రియాలో జరిగింది.ఓ వ్యక్తి టాయిలెట్ కి వెళ్లి కూర్చోవడంతో అతని మీదకు పైథాన్ దాడి చేసింది.ఆ వ్యక్తి ప్రైవేటు పార్టు మీద కరవడంతో ఆ ఘటన స్థానికంగా కలకలం రేపింది.65 ఏళ్ల వ్యక్తి టాయిలెట్‌లోకి వెళ్లినప్పుడు అతను టాయిలెట్ సీటుపై కూర్చున్నాడు.ఆ సమయంలో అక్కడ అలికిడి కలిగింది.అతనికి ఏదో కొత్తగా ఉన్నట్టుగా అనిపించింది.

ఏందబ్బా అని చూడగానే అతని మైండ్ బ్లాక్ అయిపోయింది.ఫైథాన్ అక్కడ ఉండటంతో భయం భయంగా అక్కడి నుంచి లేచాడు.

అతడు ఆ ఫైథాన్ ఏం చేస్తుందోనని భయపడే సమయంలోనే ఆ వ్యక్తి ప్రైవేటు పార్ట్‌ పై కరిచేసింది.వెంటనే ఆ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు.

అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం అతడి పరిస్థితి కొంత మెరుగ్గానే ఉందని అధికారులు తెలిపారు.

Telugu Austrian, Bitten, Python, Toilet, Latest-Latest News - Telugu

ఈ ఘటన ఆస్ట్రియాలోని గ్రాజ్ అనే నగరంలో జరిగింది.ఆ వృద్దుడి ఇంటి టాయిలెట్‌ లో కనిపించిన ఫైథాన్ ను పక్కింటివాళ్లు పెంచుకుంటున్నట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు.ఆ పక్కింట్లో నివసిస్తున్న వాళ్లు ఏకంగా 11 పాములను పెంచుతున్నట్లుగా తెలిపారు.పక్కింట్లోకి వెళ్లిన ఆ పాము కూడా డ్రైన్ పైప్ ద్వారా బాధితుడి టాయిలెట్‌ లోకి ప్రవేశించిందని నిర్దారించారు.

పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube