బాక్సాఫీస్ లెక్కలు తారుమారు చేయడం ఇకపై ఈజీ కాదు     2017-01-02   22:09:55  IST  Raghu V

బాక్సాఫీస్ లెక్కలు గందరగోళంగా ఉంటాయి. అన్నీ ఏరియాల్లో ట్రాకింగ్ వ్యవస్థ సరిగా ఉండదు. ట్రాకింగ్ సరిగా లేని చోట హీరో పీఅర్ టీమ్, నిర్మాతలు తీసుకొచ్చే కాకి లెక్కలే మీడియాలో వచ్చేస్తాయి. దాంతో జనాలు కూడా అవే నమ్మేస్తారు. పోని, ట్రాకింగ్ బాగా ఉన్నచోట్ల లెక్కల తారుమారు జరగదా అంటే అలా కూడా కాదు. అవకాశం తక్కువ ఉన్నా, హీరోల పీఆర్ టీమ్ తల్చుకుంటే వాటిని కూడా ఫేక్ చేసేస్తారు.

2016 లో వచ్చిన తెలుగు బ్లాక్బస్టర్ సినిమాల్లో కూడా హీరో ఇమేజ్ పెంచడం కోసం వచ్చిన దాని కన్నా ఎక్కువ చేప్పిన పరిస్థితి లేకపోలేదు. ఏం, చేస్తాం మనదేశంలో కలెక్షన్ ట్రాకింగ్ అలా ఉంది మరి.

హాలివుడ్ లో అలా కాదు. ప్రతి థియెటర్ కలెక్షన్ నిర్మాణ సంస్థ నుంచి కాదు ప్రకటించబడేది. Rentrack (ఇప్పుడు comScore) అనే ట్రాకింగ్ వ్యవస్థ సినిమాలు కలెక్షన్లు రిపోర్టు చేస్తుంది. అందుకే మన తెలుగు సినిమాల ఓవర్సీస్ కలెక్షన్లలో రూపాయి కూడా పెంచి చెప్పలేరు మన నిర్మాతలు, పీఆర్ టీమ్స్.

ఇప్పట్లో పూర్తి మార్పు జరగకపోయినా, మరికొన్ని సంవత్సరాల్లో మనదేశంలో కూడా ఇలాంటి మార్పు రాబోతోంది. ప్రముఖ మల్టిప్లెక్స్ చైన్ PVR, తమ థియేటర్ల్ బాక్సాఫీస్ కలెక్షన్ కోసం Rentrack తో చేతులు కలిపింది. భారతదేశంలోని 562 PVR స్క్రీన్స్ లో ఇకనుంచి రెంట్రాంక్ పనిచేయనుంది. అంటే PVR థియేటర్ల కలెక్షన్ ని ఫేక్ చేయలేరు అన్నమాట.

PVR ని చూసి, Carnival, Cinepolis, Asian Cinemas, Inox లాంటి మల్టిప్లెక్స్ థీయేటర్ చైన్స్ మాత్రమే కాకుండా, సింగల్ స్క్రీన్స్ కూడా Rentrack తో చేతులు కలిపితే, ఇక నిర్మాతలు, పీఅర్ టీమ్స్ వచ్చిన కలెక్షన్లను ఫేక్ చేసి, పెంచి చెప్పలేరు.