టెంపర్ ను మార్చేసిన పీవీపీ??  

  • యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ సినిమా సెన్సార్ హడావిడిలో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే…అయితే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని తుది దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ ఫిలింనగర్ లో హాట్హాట్ గా చక్కెర్లు కొడుతుందివిషయం ఏమిటంటే…ప్రముఖ నిర్మాత ఫైనాన్స్ షియర్ అయిన పొట్లూరి వరప్రసాద్ చివరి నిముషంలో ఈ సినిమాను చూసి కొన్ని మార్పులు చేయడంతో పాటు ఈ సినిమాలోని కొన్ని సీన్స్ పట్టుపట్టి తీయించేసారని టాక్. దీనికి కారణం పొట్లూరి వరప్రసాద్ ఈ సినిమాకు ఫైనాన్స్ చెయ్యడమే. ఇక ఈ మార్పులేవీ దర్శకుడుపూరీనిర్మాతగణేశ్ కు ఇష్టం లేకుండా చేశారు అన్న టాక్ బలంగా వినిపిస్తుంది. పొట్లూరి మాట వినకపోతే సినిమా విడుదల సమయంలో ఏదో ఒక ఇబ్బంది పెడతారని బండ్ల గణేష్ భయపడినట్లు తెలుస్తుంది. ఇక ఇవన్ని పక్కన పెడితేఈ నెల 13న టెంపర్ ను ప్రపంచ వ్యాప్తంగా 1000 ధియేటర్లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఒక్క అమెరికాలోనే 100కుపైగా స్క్రీన్లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అని టాక్. అన్నీ తానై ఎన్టీఆర్ ఈ చిత్రాన్ని తన భుజాలపై వేసుకుని నడిపించాడు. మరి ఈ చిత్రం ఎన్టీఆర్ కు ఎంతవరకూ కలసి వస్తుందో చూడాలి.