ఆ నిర్మాతకి సినిమాలు ఎలా నిర్మించాలో తెలియదా?   PVP Doesn’t Know How To Plan A Film Production?     2016-12-31   00:07:17  IST  Raghu V

పీవిపి సినిమా .. చాలా ప్రెస్టీజియస్ నిర్మాణ సంస్థ. చాలావరకు పెద్ద సినిమాలే నిర్మించారు. మరీ ఠక్కున పీవిపి నుంచి వచ్చిన బ్లాక్ బస్టర్స్ ఏంటి అంటే గుర్తుకురావడం కూడా కష్టం. సరే, సినిమా ఫలితం తమ చేతుల్లో లేకపోవచ్చు, సినిమా ఫేయిల్ అది ప్రధానంగా డైరెక్టర్ తప్పు అనుకోవచ్చు. మరి ఏ సినిమా ఎలా నిర్మించాలో అలా నిర్మించకపోతే మరి అది ఎవరు తప్పు?

పివిపి వారు నిర్మించేది కాంబినేషన్నే తప్ప, కథను కాదని ఫిలింనగర్ లో చర్చలు జరుగుతాయి. అందుకే కారణం ఆ నిర్మాత ట్రాక్ రికార్డే. వర్ణ, సైజ్ జీరో, బెంగళూరు నాటకాల్, బ్రహ్మోత్సవం, చివరకి బాక్సాఫీస్ లెక్కల్లో హిట్ అయిన ఊపిరి, అన్ని కాస్ట్ ఫేల్యూర్సే. బడ్జెట్ పరిమితులు ప్రతీ సినిమా దాటడం ఏంటి ? తీసేది భారి యాక్షన్ సినిమాలు కావు, అయినా బడ్జెట్ మాత్రం హద్దులు దాటిపోతూనే ఉంటుంది.

ఎప్పటికప్పుడు కోట్ల రూపాయలు నష్టపోతూనే ఉంది ఆ నిర్మాణ సంస్థ. సరైన ప్లానింగ్ ఉండట్లేదు కాబట్టే, బ్రహ్మోత్సవం సమయంలోనే మహేష్ అసంతృప్తి లోనయ్యాడు. చేయాల్సిన రెండొవ సినిమా క్యాన్సిల్ చేసుకోని, తీసుకున్న డబ్బు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేసాడు.

ఇప్పుడు ఊపిరి సినిమాకి డబ్బులు ఎక్కువ పెట్టించాడు వంశీ పైడిపల్లి, ఒప్పుకున్న సినిమా క్యాన్సల్ చేసుకున్నాడు మహేష్, అంటూ ఫిర్యాదులు ఇచ్చుకుంటే ఏం లాభం, సినిమా నిర్మాణంలో ఉండగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి కాని.

,