వైసీపీలో చేరనున్న పీవీపీ! విజయవాడ నుంచి ఎంపీగా నిలబడే ఛాన్స్!  

వైసీపీలో చేరబోతున్న ప్రసాద్ వి పొట్లూరి, తోట ఫ్యామిలీ, మాగుంట, సినీ నటుడు రాజా రవీంద్ర. .

Pvp Confirm To Join Ysrcp And Like To Contest In Vijayavada-

ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అత్యంత సన్నిహితుడు ప్రసాద్ వి పొట్లూరి తన రాజకీయ ప్రవేశానికి మార్గం ఏర్పరుచుకున్నారు. అయితే జనసేన వెంట అతను ఉంటాడని భావించిన ఊహించని విధంగా వైసీపీ పార్టీలో చేరడానికి రెడీ కావడం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి నెలకొంది. ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయిన నేపధ్యంలో వైసీపీలో చేరే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది..

వైసీపీలో చేరనున్న పీవీపీ! విజయవాడ నుంచి ఎంపీగా నిలబడే ఛాన్స్!-PVP Confirm To Join YSRCP And Like To Contest In Vijayavada

సర్వేలు, సమీకరణాలు ఆ పార్టీకి అనుకూలంగా వుండటంతో చాలా మంది వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు జగన్ తో పని చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా వుంటే గత ఎన్నికలలో విజయవాడ పార్లమెంట్ బరిలో పోటీ చేయాలని భావించిన ప్రసాద్ వి పొట్లూరి కి జనసేన, టీడీపీ పొత్తు కారణంగా అవకాశం దొరకలేదు. అయితే ఈ సారి ఎలా అయిన బరిలో నిలబడాలని నిర్ణయించుకున్న పివిపి జగన్ ని కలిసి తన సత్తా నిరూపించుకొని టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.

ఇక ఇదే దారిలో టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాస రెడ్డి, కాకినాడ ఎంపీ తోట నరసింహం నటుడు రాజా రవీంద్ర ఈ రోజు జగన్ సమక్షంలో వైసీపీ పార్టీ కండువా కప్పుకోబోతుననారు. మరి వైసీపీ పార్టీ పీవీపీ ఆశలని ఎంత వరకు నెరవేరుస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.