గోల్డ్ మెడలే టార్గెట్ గా దూసుకెళ్తున్న పివి సింధు...!

ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనవి ఒలింపిక్స్ క్రీడలు.చాలామంది వీటిలో పతకాలు సాధించాలని ఎంతో శ్రమిస్తుంటారు.

 Pv Indus Looming As Gold Medal Target , Gold Medel, Pv Sindhu, Sports Updates, T-TeluguStop.com

ఇందులో ఏ పతకమైన సాధిస్తే చాలు.ఇకవారు అద్భుతమైన జీవితాన్ని పొందినట్టే అవుతుంది.

ప్రపంచ దేశాలన్నీ ఈ ఒలంపిక్స్ గేమ్స్ కోసం బరిలోకి దిగుతుంటాయి.తమ దేశంలో క్రీడాకారులు ఎవరైనా ఒలంపిక్స్ లో పతకం సాధిస్తే ఇక దేశం మొత్తం వారికి బంపరాఫర్లు ప్రకటిస్తారు.

నగదు బహుమతులు ఇస్తారు.ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారు.

తాజాగా టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్‌ గేమ్స్ లో భారతదేశానికి చెందినటువంటి పీవీ సింధు దూకుడుగా ఆడుతున్నారు.పీవీ సింధు ఒలింపిక్స్ లో బంగారు పతకాన్ని సాధించడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు.

మహిళల సింగిల్స్ గ్రూప్ J లో పీవీ సింధుకు విజయం వరించింది.

Telugu Gold Medel, Latest, Pv Sindhu, Ups, Tokyo Olm-Latest News - Telugu

వరుసగా రెండు సార్లు గెలవడంతో ఆమె గ్రూప్ లో మొదటి స్థానంలో ఉంది.దీంతో పీసీ సింధు ప్రీక్వార్టర్ లోకి అడుగు పెట్టింది.ఇప్పుడు తాజాగా క్వార్టర్స్ కు సింధు చేరింది.ప్రీక్వార్టర్ లో డెన్మార్క్ క్రీడాకారిణి బ్లిక్ ఫెల్ట్ పై పీవీ సింధు విజయం సాధించింది.21-15, 21-13 తేడాతో బ్లిక్ ఫెల్ట్ ను పీవీ సిందు ఓటమిపాలు చేసింది.మూడుసార్లు గెలుపు సాధించడంతో గ్రూప్ – J లో పీవీ సింధు మొదటి స్థానంలో కొనసాగుతోంది.ప్రీక్వార్టర్ లో డెన్మార్క్ కు చెందిన 12వ ర్యాంకర్ మియా బ్లిక్ ఫెల్ట్ తో పీవీ సింధు తలపడుతోంది.

ఆమె సింధు ఇప్పటికే 5 సార్లు పోటీ పడింది.అందులో నాలిగింటిలో సింధు విజయం సాధించింది.ఒక మ్యాచ్ లో మాత్రం బ్లిక్ ఫెల్ట్ విజయం సాధించింది.ఈ సంవత్సరం మొదటిలో థాయ్ లాండ్ ఓపెన్ లో సింధుపై బ్లిక్ ఫెల్ట్ విజయం సాధించారు.

ప్రస్తుతం పీవీ సింధు దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారు.బంగారం పతకం సాధించడానికి సింధు అహర్శశలు కష్టపడుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube