కొత్త మంత్రి 'పువ్వాడ' ప్రస్థానం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన క్యాబినేట్‌ను పూర్తి స్థాయిలో విస్తరించాడు.12 మంది ఉన్న తన కాబినేట్‌లోకి కొత్తగా ఆరుగురు మంత్రులను తీసుకున్నారు.నిన్న వారితో తెలంగాణ రెండవ గవర్నర్‌ అయిన తమిళిసై సౌందరరాజన్‌ ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది.అంతా అనుకుననట్లుగానే హరీష్‌ రావు, కేటీఆర్‌, సబిత ఇంద్రారెడ్డిలకు ఛాన్స్‌ దక్కింది.

 Puvvadaajay Kumar Politicalcareer Kmm-TeluguStop.com

నిన్న ప్రమాణ స్వీకారం చేసిన వారిలో పువ్వాడ అజయ్‌ కుమార్‌ ఒకరు.ఈయనకు కేసీఆర్‌ రవాణా శాఖను కేటాయించడం జరిగింది.

ఖమ్మం జిల్లాకు చెందిన ఈయన గురించి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వెదికేస్తున్నారు.

పువ్వాడ అజయ్‌ కుమార్‌ తండ్రి సీపీఐ జాతీయ స్థాయి లీడర్‌.

తండ్రి కమ్యూనిస్టు భావాలను ఒంట పట్టించుకుని పెరిగిన పువ్వాడ ఇంటర్మీడియట్‌ వరకు ఖమ్మంలో ఆ తర్వాత హైదరాబాద్‌లో చదువు కొనసాగించారు.ఎంఎస్‌సిలో గోల్డ్‌ మెడల్‌ను సాధించిన పువ్వాడ తండ్రిని ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.

వైసీపీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పువ్వాడ ఆ తర్వాత కాంగ్రెస్‌లో జాయిన్‌ అయ్యారు.మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున గెలిచి టీఆర్‌ఎస్‌లో జాయిన్‌ అయ్యారు.కేటీఆర్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా మరియు ఖమ్మం నుండి మంత్రి వర్గంలో చోటు దక్కాలి ఉన్న కారణంగా పువ్వాడకు కేసీఆర్‌ మంత్రి వర్గంలో స్థానం దక్కింది.చాలా కాలం తర్వాత ఖమ్మం నుండి మంత్రి వర్గంలోకి జిల్లా వాసుడు రావడంపై ఆ జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube