జిల్లాలు గ్రీన్‌ జోన్‌లయితేనే బస్సులు తిరిగేనట

తెలంగాణలో ఆర్టీసీ బస్సులు రోడ్డు ఎక్కే విషయంలో మంత్రి పువ్వాడ అజయ్‌ స్పందించారు.ఏపీలో ఆర్టీసీ బస్సులను నడిపేందుకు సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

 Puvvada Ajay Kumar Comments On Telangana Rtc, Telangana, Rtc, Kcr, Puvvada Ajay-TeluguStop.com

ఈ విషయంమై మంత్రిని మీడియా ప్రశ్నించగా ప్రస్తుతానికి ఆ ఏర్పాట్లు ఏం చేయలేదు.లాక్‌డౌన్‌ సఢలింపు నేపథ్యంలో జిల్లాల్లో బస్సు సర్వీసులు నడిపేందుకు అధికారులు సిద్దంగా ఉన్నారు.

కాని ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు ఎలాంటి అనుమతి లేకపోవడంతో ఆర్టీసీ అనుమతుల కోసం వెయిట్‌ చేస్తోంది.

తాజాగా మంత్రి పువ్వాడ ఈ విషయమై స్పందిస్తూ.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారి అధ్యక్షతన జరుగబోతున్న సమీక్ష సమావేశంలో ఈ విషయం గురించి మాట్లాడుతాం.అయితే రాష్ట్రంలోని జిల్లాలు అన్ని కూడా గ్రీన్‌ జోన్‌లు అయినప్పుడు మాత్రమే మేము బస్సులను నడపాలని భావిస్తున్నట్లుగా పేర్కొన్నాడు.

ఇప్పటికే పలు జిల్లాల్లో కేసులు ఏమీ నమోదు కావడం లేదు.కనుక త్వరలోనే జీహెచ్‌ఎంసీ పరిధిలోని జిల్లాలు కాకుండా ఇతర జిల్లాలు అన్ని కూడా గ్రీన్‌ జోన్‌లుగా మారే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ నెలాఖరు నుండి బస్సులు రోడ్డు ఎక్కే అవకాశం ఉందని జనాలు వెయిట్‌ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube