ట్రంప్ గెలుపే లక్ష్యం.. అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ వేలుపెట్టిన రష్యా, నిజమేనన్న ఇంటెలిజెన్స్

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాలైన అమెరికా- రష్యాల మధ్య వైరం గురించి అందరికీ తెలిసిందే.కానీ ఇరు దేశాల అధినేతలు మాత్రం కొన్ని సార్లు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పరస్పరం సహకరించుకున్న సంఘటనల్ని ఈ ప్రపంచం కళ్లారా చూసింది.

 Putin Likely Directed Efforts To Swing 2020 Us Election To Trump, America, Russi-TeluguStop.com

ఇక 2016లో డొనాల్డ్ ట్రంప్ గెలిచేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహయ సహకారాలు అందించారంటూ బయటపడిన ఓ నివేదిక అప్పట్లో సంచలనం సృష్టించింది.దీనిపై పెద్ద దుమారం రేగిన సంగతి తెలిసిందే.

అయితే 2016లో ప్రచార సమయంలో ట్రంప్‌ ప్రచార బృందం రష్యాతో కలసి కుట్రకు పాల్పడిందనడానికి ఆధారాలు లేవని విచారణ కమిటీ తేల్చింది.రెండేళ్ల పాటు ట్రంప్‌ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా పరిణమించిన ఈ వ్యవహారంపై ప్రత్యేక న్యాయవాది రాబర్ట్‌ ముల్లర్‌ అమెరికా కాంగ్రెస్‌కు నివేదికను సమర్పించారు.

ట్రంప్‌ ప్రచారానికి సాయం చేస్తామని రష్యా నుంచి పలు వ్యక్తిగత ప్రతిపాదనలు వచ్చినా, ఎన్నికల్లో ఎలాంటి కుట్ర జరగలేదని విచారణలో తేలిందని ముల్లర్ తెలిపారు.దీంతో ఆ వివాదం నెమ్మదిగా సద్దుమణిగింది.

అయితే తాజా అధ్యక్ష ఎన్నికల్లోనూ రష్యా మరోసారి జోక్యం చేసుకుందన్న వార్తలతో అమెరికా రాజకీయ వర్గాలు ఉలిక్కిపడ్డాయి.ఈ ఎన్నికల్లో ట్రంప్‌కు లబ్ధిచేకూర్చి బైడెన్‌ను నష్టపర్చేలా రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రయత్నించినట్లు అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ విభాగం డైరెక్టర్ యావ్రిల్ హెయిన్స్ ధ్రువీకరించారు.2020 ఎన్నిక‌ల్లో విదేశీ శ‌క్తుల హ‌స్తం గురించి డైరెక్ట‌ర్ ఆఫ్ నేష‌న‌ల్ ఇంటెలిజెన్స్ కార్యాల‌యం స‌వివ‌రంగా నివేదిక రూపొందించింది.ర‌ష్యా, ఇరాన్, చైనాలు ఎన్నిక‌ల‌ను ప్ర‌భావితం చేయ‌డానికి ప్ర‌య‌త్నించిన మాట వాస్త‌వ‌మే కానీ.

చివ‌రికి అలా చేసిన‌ట్లు స్ప‌ష్ట‌మైన ఆధారాలు మాత్రం లేన‌ట్లు ఈ నివేదిక స్ప‌ష్టం చేసింది.డొనాల్డ్ ట్రంప్‌ను గెలిపించుకోవ‌డానికి నేరుగా పుతినే రంగంలోకి దిగ‌గా.ట్రంప్‌ను ఎలాగైనా ఓడించ‌డానికి ఇరాన్ ప్ర‌య‌త్నించిన‌ట్లు ఈ నివేదిక చెప్పింది.బైడెన్ గెలుపు కోసం ప్ర‌య‌త్నించాల‌ని చైనా అనుకున్నా.

చివ‌రికి నేరుగా జోక్యం చేసుకోలేద‌ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తేల్చి చెప్పింది.

ట్రంప్‌కు సన్నిహితులైన అధికారులను వినియోగించుకొని బైడెన్‌పై తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేసేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలింది.

పుతిన్‌.ఉక్రెయిన్‌ చట్ట సభ సభ్యుడు ఆండ్రీ డెర్కెచ్‌ను ఉపయోగించుకొని ట్రంప్‌ను ప్రభావితం చేసినట్లు ఇంటెలిజెన్స్ గుర్తించింది.

ట్రంప్‌ అటార్ని రూడీ గులియానీని అతను వాడుకొని తప్పుడు సమాచారాన్ని వ్యాపింప జేశారని పేర్కొన్నారు.బైడెన్‌ కుమారుడిపై మాస్కోకు అత్యంత సన్నిహితంగా వుండేవారే తప్పుడు సమాచారాన్ని ప్రచారాన్ని వెల్లడించింది.2020 మొదటి నుంచి బైడెన్‌, ఆయన కుటుంబీకులు ఉక్రెయిన్‌తో కలిసి అక్రమాలకు పాల్పడ్డట్లు రష్యా వర్గాలు ప్రచారం చేశాయి.నిజానికి బైడెన్‌గానీ, ఆయన కుమారుడిపై గానీ వచ్చిన ఆరోపణలకు ఆధారాలు లేవని ఇంటెలిజెన్స్ నివేదిక వెల్లడించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube