''ఫోటో పెట్టు... గిఫ్ట్ పట్టు''   Put The Photo After Winning Gift By Ghmc     2018-10-16   13:34:49  IST  Sai M

తెలంగాణాలో ఎన్నికల పోలింగ్ శాతం పెంచేందుకు ‘ఫొటో కొట్టు-బహుమతి పట్టు’ అంటు పోటీలు నిర్వహించాలని నిర్ణయించారు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌. జిల్లా ఎన్నికల అధికారి దానకిశోర్‌ ఆదేశాల మేరకు ఈ పోటీలు జరుపనున్నారు. 18 ఏళ్లు నిండి ఓటరు కార్డు కలిగిన వారు ఎన్నికల ప్రాధాన్యతకు సంబంధించి మంచి ఫొటోతో కూడిన శీర్షిక (క్యాప్షన్‌)ను రాసి 79931 53333 నంబర్‌కు వాట్సప్‌ చేయాలి మెస్సేజ్‌ చేసిన వారు తమ ఓటరు ఐడీ కార్డును కూడా జతచేసి పంపించాలి.

నేటి నుంచి నవంబర్‌ 16 వరకు వాట్సప్‌ ద్వారా పంపిన ఫొటోల్లో లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి విజేతలను ఎంపిక చేస్తారు. మొదటి బహుమతిగా రూ.25,000, రెండో బహుమతి రూ.20,000, తృతీయ బహుమతి రూ.15,000 ఇవ్వనున్నారు. పోటీల్లో పాల్గొనే వారు హైదరాబాద్‌ జిల్లాకు చెందిన వారై ఉండాలని, ఇక్కడి ఓటరు గుర్తింపు కార్డు ఉండాలని అధికారులు పేర్కొన్నారు.