చెత్త ట్రక్కుపై పుషప్స్.. కాలు జారడంతో సీన్ రివర్స్.. వీడియో వైరల్!

ఈ రోజుల్లో యువత అనాలోచితంగా పిచ్చి స్టంట్స్ చేస్తూ ప్రమాదాల్లో పడుతున్నారు.ట్రైన్ డోర్ కు వేలాడుతూ పరిగెత్తడం, ట్రైన్ వస్తుండగా పట్టాలపై పడుకోవడం, బస్సును చేజింగ్ లో ఎక్కడం, బైక్ తో డెడ్లీ స్టంట్స్ చేయడం యువతలో అలవాటుగా మారుతోంది.

 Pushups On A Garbage Truck.. Sean Rivers Slips His Leg Video Goes Viral Dustbin,-TeluguStop.com

తాజాగా ఒక యువకుడు వేగంగా వెళ్తున్న ఓ చెత్త ట్రక్కుపై పుషప్స్ చేశాడు.అంతే కాదు దానిపై నిలుచుని తానేదో శక్తిమాన్ అన్నట్లు రెండు చేతులు చాచి ఏ సపోర్టు లేకుండా పోజులు ఇచ్చాడు.

అయితే ఆ చెత్త ట్రక్కు పైభాగం చాలా నునుపుగా ఉంది.అందులోనూ అది వేగంగా దూసుకెళుతోంది.

ఆ క్రమం లోనే ఒక కుదుపు వచ్చింది.అంతే దానిపై నిల్చున్న యువకుడు కిందపడిపోయాడు.

దాంతో అతడికి వీపు, మోచేయి, తుంటి, కాలుపై తీవ్రమైన గాయాలయ్యాయి.

దీనికి సంబంధించిన వీడియోని వెనకే వస్తున్న ఒక వాహనదారుడు తన కెమెరాలో బంధించాడు.

అది కాస్తా ఇప్పుడు వైరల్ అయ్యింది.లక్నోలోని గోమతీనగర్‌లో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

మహిళా పోలీస్ అధికారి శ్వేతా శ్రీవాస్తవ ఈ వీడియో ని ట్విట్టర్‌లో షేర్ చేశారు.“గత రాత్రి జులై 16న లక్నోలోని గోమతీనగర్ లో ఈ యువకుడు శక్తిమాన్‌గా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ అతను ప్రమాదానికి గురయ్యాడు.

ఇప్పుడు కొన్ని రోజులు సరిగ్గా కూర్చోలేడు! హెచ్చరిక: దయచేసి ఇలాంటి ఘోరమైన విన్యాసాలు చేయకండి!” అని ఆ పోలీస్ అధికారి ఒక క్యాప్షన్ జతచేశారు.ఈ వీడియో క్లిప్‌కి మూడు లక్షల 50 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.దీన్ని చూసిన నెటిజనులు యువకుడిని తిట్టిపోస్తున్నారు.“తగిన శాస్తి జరిగిందా? ఇలాంటివి ఇకపై చేయకు” అని సలహాలు ఇస్తున్నారు.ఈ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube