ఆల్ టైం టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసిన పుష్పరాజ్ టీజర్

ఈ మధ్యకాలంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లక్ జెట్ స్పీడ్ తో పరుగు పెడుతుంది.అతను ఏం చేసిన సోషల్ మీడియాలో అది సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

 Pushpas Teaser Establishes An All Time Record-TeluguStop.com

టాలీవుడ్ నుంచి హిందీ డబ్బింగ్ సినిమాల పరంగా అతి పెద్ద మార్కెట్ అల్లు అర్జున్ కి ఉంది.అతని హిందీ డబ్బింగ్ సినిమాలకి వందల మిలియన్స్ లో వ్యూస్ వస్తూ ఉన్నాయి.

ఇక అల్లు అర్జున్ అంటే ప్రస్తుతం ఉన్న యువ హీరోలలో డాన్స్ ఐకాన్.అతని డాన్స్ స్టెప్పులకి చాలా మంది ఫాన్స్ ఉన్నారు.

 Pushpas Teaser Establishes An All Time Record-ఆల్ టైం టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసిన పుష్పరాజ్ టీజర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందుకే మ్యూజిక్ దర్శకులు కూడా బన్నీ సినిమా అంటే అదిరిపోయే రేంజ్ లో స్టెప్పులు ఉండే విధంగా ట్యూన్స్ కంపోజ్ చేస్తూ ఉంటారు.ఈ కారణంగానే అతని సినిమాలలో సాంగ్స్ అన్ని కూడా చాలా వరకు సూపర్ హిట్ అవుతూ ఉంటాయి.

ఇక అల వైకుంఠపురంలో సాంగ్స్ అయితే నేషనల్ వైడ్ గా వైరల్ అయ్యాయి.బుట్టబొమ్మకి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ వచ్చింది.

అలాగే బన్నీ యాక్షన్ సీక్వెన్స్ కి కూడా విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు.అతని సినిమాలలో యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని కూడా కొత్తగానే ఉంటాయి.దర్శకులు కూడా క్రియేటివిటీకి పదును పెట్టి బన్నీకోసం ప్రత్యేకంగా యాక్షన్ సీక్వెన్స్ సిద్ధం చేస్తారు.ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో ఫస్ట్ టైం పక్కా మాసివ్ రోల్ లో పుష్ప సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాలో అతని పాత్ర పేరు పుష్పరాజ్.రీసెంట్ గా ఈ సినిమా టీజర్ ని సుకుమార్ రిలీజ్ చేశాడు.

టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేసింది.టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆల్ టైం రికార్డ్ ని క్రియేట్ చేసింది.

ఏకంగా 60 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసిన ఇంట్రడక్షన్ వీడియోగా పుష్ప టీజర్ అరుదైన గుర్తింపు సొంతం చేసుకుంది.అలాగే 1.4 మిలియన్ లైక్స్ కూడా దీనికి రావడం విశేషం.మొత్తానికి పాటలతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న బన్నీ పుష్ప టీజర్ తో కూడా తన మార్క్ చూపించుకున్నాడని చెప్పాలి.

#All Time Record #Pushpa's Teaser #Sukumar #Allu Arjun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు