వద్దని వెళ్లినా పట్టుపడుతున్న పుష్ప  

Pushpa Team Waiting For Vijay Sethupathi, Pushpa, Vijay Sethupathi, Allu Arjun, Sukumar, Rashmika Mandanna - Telugu Allu Arjun, Pushpa, Rashmika Mandanna, Sukumar, Vijay Sethupathi

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘అల వైకుంఠపురములో’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయడంతో పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

 Pushpa Vijay Sethupathi Allu Arjun

ఇక ఈ సినిమా నాన్-బాహుబలి రికార్డులను క్రియేట్ చేయడంతో బన్నీ రేంజ్ మరింత పెరిగిపోయింది.

ఇప్పుడు తన నెక్ట్స్ మూవీ పుష్పను రెడీ చేసే పనిలో బన్నీ ఉన్నాడు.

వద్దని వెళ్లినా పట్టుపడుతున్న పుష్ప-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది.కాగా ఈ సినిమాలో బన్నీ ఊరమాస్ లుక్‌లో మనకు కనిపిస్తుండగా, ఇందులో విలన్ పాత్రలో తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతిని చిత్ర యూనిట్ తొలుత ఓకే చేసుకుంది.

కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఈ సినిమా నుండి వాకౌట్ చేసినట్లు వార్తలు వచ్చాయి.అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వేరు నటీనటులను తీసుకునే ఆలోచనలో సుకుమార్ అండ్ టీమ్ లేదని తెలుస్తోంది.

దీంతో విజయ్ సేతుపతిని ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించేందుకు ఒప్పించే పనిలో మళ్లీ పడ్డారట.మరి ఈసారైనా విజయ్ సేతుపతి పుష్ప సినిమాలో కన్ఫంగా చేస్తాడా లేడా అనేది ఆసక్తికరంగా మారింది.

ఇక ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తుండగా, కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది.ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా తిరిగి ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

#Sukumar #Pushpa #Allu Arjun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pushpa Vijay Sethupathi Allu Arjun Related Telugu News,Photos/Pics,Images..