ముందుకు జరిగిన పుష్ప.. తగ్గేదే లే!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ కోసం కేవలం తెలుగు ఆడియెన్స్ మాత్రమే కాకుండా ఇతర భాషల ఆడియెన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో వీరిద్దరి కాంబోలో రాబోయే మూడో సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 Pushpa To Release On Dec 17, Pushpa, Allu Arjun, Sukumar, Rashmika Mandanna, Tol-TeluguStop.com

అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా ఈపాటికి రిలీజ్ కూడా అయ్యేది.కానీ కరోనా కారణంగా ఇతర సినిమాల్లాగా ఈ సినిమా కూడా ఆలస్యం అవుతూ వచ్చింది.

అయితే ఇప్పుడు మాత్రం ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ప్రస్తుతం చివరిదశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, అటుపై పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా అంతే స్పీడుగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ చూస్తోంది.

అయితే ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు గతంలో చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.కానీ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అనుకున్నదానికంటే స్పీడుగా జరుగుతుండటంతో రిలీజ్ డేట్ విషయంలో మరోసారి చిత్ర యూనిట్ ఆలోచిస్తుందట.

కాగా ఈ సినిమాను డిసెంబర్ చివరికి రిలీజ్ చేస్తే బాక్సాఫీస్ వద్ద లాంగ్ రన్ సాధ్యం కాదని భావించి, ఈ సినిమాను ఓ వారం ముందుకు జరిపారట.

దీంతో పుష్ప చిత్రాన్ని డిసెంబర్ 17న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ అన్ని విధాలుగా రెడీ కాబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

పూర్తిగా అడవి నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్ అనే ఎర్రచందనం స్మగ్లర్‌గా కనిపిస్తాడు.ఈ సినిమాలో ఆయన లుక్ ప్రేక్షకులను ఇప్పటికే ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

అందాల భామ రష్మక మందన హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లనుందట.పుష్ప చిత్రం ముందుకు జరగడంతో బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube