టాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలలో ”పుష్ప ది రూల్” ఒకటి.ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోటి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
మన సౌత్ ప్రేక్షకుల కంటే కూడా నార్త్ ప్రేక్షకులు ఈ సినిమాపై ఇంకా ఆసక్తిగా ఉన్నారు.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మూవీ ఇది.
1 పార్ట్ ఘన విజయం సాధించడంతో పార్ట్ పై అన్ని అంచనాలు పెరిగాయి.ఇదిలా ఉండగా ఈ సినిమా అడవుల నేపథ్యంలో సాగుతుంది అన్నది అందరికి తెలుసు.
అందుకు ఈసారి కూడా 80 శాతం షూట్ అవుట్ డోర్ లోనే తీయాల్సి వస్తుంది.ఇప్పటి వరకు బాగానే తెరకెక్కించిన ఇప్పుడు వర్షం కారణంగా పుష్ప( Pushpa ) షూట్ కు అంతరాయం కలుగుతున్నట్టు తెలుస్తుంది.
అసలు ఈ రోజు పుష్ప కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవ్వాల్సి ఉండగా భారీ వర్షం కారణంగా వాయిదా పడినట్టు తెలుస్తుంది.వర్షాకాలం కారణంగా ముందు ముందు కూడా ఈ సినిమా షూట్ కు అంతరాయం తప్పదు.ఇప్పటికే పుష్ప 2 భారీ యాక్షన్ ( Action ) సన్నివేశాలను చిత్రీకరించారని అయితే అందుకు సంబంధించి కొన్ని ప్యాచ్ వర్క్ మాత్రం బ్యాలెన్స్ ఉందట.అవుట్ డోర్ షూట్ కాబట్టి ఇలాంటి వాటిని ఎదుర్కొని నిలబడక తప్పదు.
కాగా ఇందులో హీరోయిన్ రష్మిక మందన్న ( rashmika ) అల్లు అర్జున్ కు జోడీగా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ నిర్మాణ విలువలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.అలాగే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్వి దే శ్రీ ప్రసాద్( Devi sri prasad ) సంగీతం అందిస్తున్నాడు.ఇక వర్షాలు బాగా అంతరాయం కలిగిస్తే ఈ ఏడాది రిలీజ్ కూడా కష్టమే.చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో.ఎప్పుడు ఎండ్ అవుతుందో.