పుష్ప ది రూల్ మూవీ ఫస్ట్ డే టోటల్ లెక్కలివే.. అక్కడ రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు పక్కా!

బన్నీ , సుకుమార్ ( Bunny, Sukumar )కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప ది రైజ్ మూవీ ( Pushpa The Rise Movie )బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా పుష్ప ది రూల్ మూవీ అంతకు మించిన హిట్ గా నిలిచింది.పుష్ప2 ఫస్ట్ డే కలెక్షన్లు 281 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది.పుష్ప ది రూల్ షేర్ కలెక్షన్ల గురించి మాత్రం పూర్తిస్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది.బాలీవుడ్ లో సైతం ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.అక్కడ ఈ సినిమాకు టికెట్లు దొరకడం లేదని తెలుస్తోంది.

 Pushpa The Rule Movie First Day Collection Details Inside Goes Viral In Social M-TeluguStop.com

నార్త్ ఆడియన్స్( North Audience ) బన్నీ నుంచి ఎలాంటి సినిమాను కోరుకున్నారో ఈ సినిమా అదే విధంగా ఉందని సమాచారం అందుతోంది.

పుష్ప ది రూల్ కు కొంతమంది నుంచి నెగిటివ్ టాక్ వినిపిస్తోంది.సునీల్, అనసూయ మరి కొందరు నటీనటుల పాత్రలు వృథా అయ్యాయని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

పుష్ప ది రూల్ కలెక్షన్ల విషయంలో మాత్రం నిర్మాతలు పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నారు.

Telugu Crore Rupees, Bunny, Mythri Makers, Audience, Pushpa Rule, Pushpa Rule Da

పుష్ప ది రూల్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ( Mythri Movie Makers Banner )కు అన్ని విధాలుగా హెల్ప్ అవుతోందని చెప్పవచ్చు.ఈ బ్యానర్ లో ఇప్పటివరకు వచ్చిన అన్ని సినిమాలను మించి ఈ సినిమాకు బిజినెస్ జరిగింది.అయితే నిర్మాతల అత్యాశ వల్ల భారీగా పెరిగిన టికెట్ రేట్లు సినిమాకు మైనస్ అవుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

పుష్ప ది రూల్ సినిమాలో ఎలివేషన్ సీన్లు మాత్రం అద్భుతంగా ఉన్నాయి.

Telugu Crore Rupees, Bunny, Mythri Makers, Audience, Pushpa Rule, Pushpa Rule Da

పుష్ప ది రూల్ మూవీకి ఈరోజు కూడా బుకింగ్స్ బాగానే ఉన్నా శని, ఆదివారాల బుకింగ్స్ ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది.పుష్ప ది రూల్ మూవీ టాలీవుడ్ రేంజ్ ను పెంచిన సినిమా కావడంతో పాటు 2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube