అనుకున్న దానికంటే ముందే వస్తోన్న పుష్ప

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

 Pushpa Team To Resume Shooting Earlier, Pushpa, Allu Arjun, Sukumar, Rashmika Ma-TeluguStop.com

ఇక ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో బన్నీ తన నెక్ట్స్ మూవీ ‘పుష్ప’ అనే టైటిల్‌తో తెరకెక్కిస్తున్నాడు.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో పూర్తి మాస్ యాక్షన్ రివెంజ్ డ్రామాగా ఈ సినిమా రానున్నట్లు చిత్ర వర్గాలు ఇప్పటికే తెలిపాయి.

కాగా ఈ సినిమా షూటింగ్ తొలి షెడ్యూల్‌ను జరుపుకుంటుండగా, కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఈ సినిమా షూటింగ్‌ను వాయిదా వేశారు.ఇక ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే సినిమా షూటింగ్‌లు మొదలవడంతో పుష్ప తిరిగి ఎప్పుడు సెట్స్‌కు వస్తాడా అని ప్రేక్షకులు ఎంతో ఆశగా ఉన్నారు.అయితే డిసెంబర్‌లో ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలని చిత్ర యూనిట్ తొలుత భావించింది.

కానీ ఇప్పుడిప్పుడే పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటుండటంతో పుష్ప చిత్రం అనుకున్న దానికంటే ముందే రాబోతున్నట్లు తెలుస్తోంది.

డిసెంబర్ నెలలో ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలని అనుకున్నా, ఇప్పుడు నవంబర్ నెలలోనే ఈ సినిమా షూటింగ్‌ను నిర్వహించాలని చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

కేరళలోని అడవుల్లో లేదా ఏపీలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో పుష్ప సినిమా షూటింగ్‌ను నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.పూర్తిగా అడవి బ్యాక్‌డ్రాప్‌తో రాబోయే ఈ సనిమాలో బన్నీ మాస్ లుక్‌లో దర్శనమిస్తాడు.

కన్నడ కుట్టి రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తోండగా దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube