స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
ఇక ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో బన్నీ తన నెక్ట్స్ మూవీ ‘పుష్ప’ అనే టైటిల్‌తో తెరకెక్కిస్తున్నాడు.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో పూర్తి మాస్ యాక్షన్ రివెంజ్ డ్రామాగా ఈ సినిమా రానున్నట్లు చిత్ర వర్గాలు ఇప్పటికే తెలిపాయి.
కాగా ఈ సినిమా షూటింగ్ తొలి షెడ్యూల్‌ను జరుపుకుంటుండగా, కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఈ సినిమా షూటింగ్‌ను వాయిదా వేశారు.ఇక ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే సినిమా షూటింగ్‌లు మొదలవడంతో పుష్ప తిరిగి ఎప్పుడు సెట్స్‌కు వస్తాడా అని ప్రేక్షకులు ఎంతో ఆశగా ఉన్నారు.అయితే డిసెంబర్లో ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలని చిత్ర యూనిట్ తొలుత భావించింది.
కానీ ఇప్పుడిప్పుడే పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటుండటంతో పుష్ప చిత్రం అనుకున్న దానికంటే ముందే రాబోతున్నట్లు తెలుస్తోంది.
డిసెంబర్ నెలలో ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలని అనుకున్నా, ఇప్పుడు నవంబర్ నెలలోనే ఈ సినిమా షూటింగ్‌ను నిర్వహించాలని చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
కేరళలోని అడవుల్లో లేదా ఏపీలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో పుష్ప సినిమా షూటింగ్‌ను నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.పూర్తిగా అడవి బ్యాక్‌డ్రాప్‌తో రాబోయే ఈ సనిమాలో బన్నీ మాస్ లుక్‌లో దర్శనమిస్తాడు.
కన్నడ కుట్టి రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తోండగా దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.